
ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులు హిందువులకు సుద్దులు చెప్పే వారే. హిందువులపై దాడులు చేస్తూ, ఆస్తులు ధ్వంసం చేస్తూ, ఆడవాళ్ళని కిడ్నాప్ చేస్తూ, హిందువులను మతం మారుస్తూ, హిందూ దేవుళ్లను కించపరుస్తూ, దేవాలయాలను ధ్వంసం చేస్తూ ఉన్న అన్య మతస్తులను పల్లెత్తు మాట అనటానికి కూడా సదరు మేధావులకు మనస్కరించదు.
సెక్యులర్ రాజ్యమని చెప్పుకునే మన దేశంలోనే హిందువులపై అన్యమతస్తుల దాడులు నిత్యకృత్యంగా జరుగుతూ ఉన్నాయి. అలాంటిది ముస్లిములు అధికంగా ఉండే ఇస్లామిక్ దేశాల సంగతి చెప్పనలవి కాదు.
తాజాగా బంగ్లాదేశ్లో మరోసారి హిందూ దేవాలయంపై దాడి జరిగింది. ఆ దేశ రాజధాని ఢాకాలోని ఇస్కాన్ రాధాకంట ఆలయాన్ని నిన్న సాయంత్రం కొందరు కూల్చివేశారు. హజీ సైఫుల్లా అనే వ్యక్తి నేతృత్వంలో దాదాపు 200 మంది గుంపుగా వచ్చి ఆలయంపై దాడి చేసి, విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో సుమంత్ర చంద్ర శ్రవణ్, నిహార్ హాల్దర్, రాజీవ్ భాద్ర అనే వారితో పాటు చాలా మందికి గాయాలయ్యాయి.





