ArticlesNews

ఆంధ్రలో హిందువులకేదీ భరోసా?

882views

మిక్రాన్, పీఆర్సీ, ఉద్యోగుల సమ్మె, కేంద్ర బడ్జెటు, కేంద్రంపై కేసీఆర్ తిట్ల దండకం, రామానుజ విగ్రహావిష్కరణ, ఆంధ్ర, తెలంగాణాల విభజనపై పార్లమెంటులో ప్రధాని మోడీ వ్యాఖ్యలు, కర్ణాటక హిజాబ్ వ్యవహారం…. ఒక దానివెంట ఒకటి వరుసగా జరిగిపోతూ ఉన్నాయ్. వీటి మధ్యలో తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో 3 నెలల క్రిందటి వరకూ ప్రధాన శీర్షికలలో, దేశవ్యాప్త చర్చనీయాంశాలుగా ఉండిన కొన్ని విషయాలు మరుగున పడిపోయాయ్. అవన్నీ నివురుగప్పిన నిప్పులాంటి విషయాలు. ప్రజలందరూ ప్రతిక్షణమూ స్మరించుకోవాల్సిన విషయాలు. అప్రమత్తులై ప్రతినిముషమూ గమనించుకోవాల్సిన విషయాలు. మనచుట్టూ అసలేం జరుగుతోందో, ఎందుకు జరుగుతోందో పదే పదే పరీక్షించుకుని, పరిశీలించుకుని నిజానిజాలు నిర్ధారించుకోవాల్సిన విషయాలు. అలాంటి అతి ముఖ్యమైన విషయాలను కొన్నింటిని మనం ఓసారి స్మరణకు తెచ్చుకుందాం. జరిగిన, జరుగుతున్న పరిణామాలేమిటో, మన కర్తవ్యమేమిటో ఓసారి మననం చేసుకుందాం.

తిరుమలలో మామూలు లడ్డూ రూ. 50/- లు. కళ్యాణం లడ్డూ రూ. 200/-లు. పరిమితులేం లేవు. స్వీట్ స్టాల్లోలా ఎన్నయినా ఇస్తారు. ఒకవైపు తిరుమలకు భక్తుల తాకిడి బాగా తగ్గింది. కరోనా సాకుతో ఆలయ పాలనా యంత్రాంగం చేస్తున్న హడావుడే అందుకు కారణం. మద్యం కోసం క్యూలో నిలబడితే కరోనా రాదు. దైవ దర్శనానికి వెళితే మాత్రం వస్తుంది. అదన్నమాట సంగతి.

తిరుమలలో దైవ దర్శనానికి వెళ్ళిన భక్తుల్ని అక్కడి ఉద్యోగులు అడుగడుగునా వేధిస్తారు. అవమానిస్తారు. ఆంక్షల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తారు. దేవాలయ పాలనా యంత్రాంగానికి ఉద్యోగులపై ఏమాత్రం అదుపులేదు. ఉద్యోగులకు యాత్రికులతో మర్యాదగా వ్యవహరించాలన్న స్పృహ లేదు. అన్య మత ఉద్యోగులైతే భక్తులతో వీలైనంత అమర్యాదకరంగా ప్రవర్తిస్తారు. స్వామిని కూడా వీలైనంత అవమానిస్తారు. వారి కోటాలో వచ్చిన ప్రసాదాలను చెత్తబుట్టలో పడేస్తారు. వారికి ఆ పరిసరాలపై భక్తి లేదు. తామొక పవిత్ర పుణ్యక్షేత్రంలో ఉన్నామన్న స్పృహ లేదు. అసలు స్వామిని, వారి భక్తులను అవమానించాలన్న ఉద్దేశ్యంతోనే వారక్కడ పనిచేస్తున్నారన్నది నిర్వివాదాంశం. కానీ ఈ దుర్మార్గ ప్రభుత్వాలు వారి మీద ఈగ వాలనివ్వడం లేదు. వారిమీదంత ప్రేముంటే, వారిని వేరే ప్రభుత్వ రంగాలలో నియమించుకోవచ్చు కదా? ఇన్ని అభ్యంతరాల మధ్య అక్కడే ఎందుకు కొనసాగిస్తున్నట్లు? Just according to church directions only. తలచుకున్నప్పుడల్లా రక్తం మరిగిపోయే విషయమిది. దీనిపై ఓ ఉద్యమాన్నే నిర్మించాల్సిన అవసరముంది.

కరోనా సెకండ్ వేవ్ కి ముందు మాట. మా మిత్రుడి కుటుంబం కళ్యాణానికి టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. వాళ్ళు పిల్లాజెల్లతో అక్కడికెళితే… “కళ్యాణం లేదు గిళ్యాణం లేదు. దర్శనం చేసుకోని పోండి” (అక్షారాలా ఈ మాటే అన్నారు) అని ప్రత్యేక దర్శనం ఇప్పించి ఓ జాకెట్ ముక్క, కండువా ఇచ్చి పంపారు. కనీసం కళ్యాణం లడ్డూ కూడా ఇవ్వలేదు. మన సెంటిమెంట్స్ వారికర్థమవుతాయా? ఆ దేవదేవునితో మనకున్న ఆత్మానుబంధం, ఆయన పట్ల మనకున్న భక్తి, శ్రద్ధ, ఆ అనుభూతి, ఆయన సన్నిధిలో సేదదీరాలనే మన ఆరాటం, ఆయన దర్శనంతో మనలో కలిగే పులకింత…… ఈ సున్నితమైన విషయాలు వారికర్థం అవుతున్నాయా?

మొత్తానికి ఇవన్నీ తిరుమల పవిత్రతను దెబ్బతీసే చర్చి కుట్రలలో భాగమేనని సగటు భక్తుడు సైతం ఓ అభిప్రాయానికి వచ్చేశాడు నేడు. అక్కడ ఎన్నో, ఎన్నెన్నో అపచారాలు జరుగుతున్నాయి. స్వామిని భక్తులకు దూరం చేసే కుట్రలెన్నో జరుగుతున్నాయ్. ఈ ప్రభుత్వాలపై ఏమాత్రం నమ్మకం లేదు. గత ప్రభుత్వ హయాంలో SSF ఆధ్వర్యంలో నిర్మించే ఆలయాలకు చేస్తామన్న ఆర్థిక సహకారం మధ్యలోనే ఆపేశారు. ఇప్పటి ప్రభుత్వం 5 లక్షలు కాదు 10 లక్షలిస్తామని ఘనంగా వాగ్దానం చేసింది. ఇప్పటికి అయిపు లేదు.

అసలు ఈ రాష్ట్రంలో హిందువుల కోసం జరగాల్సినవెన్నో పెండింగ్ లో ఉండగా… ఇప్పుడు తిరుమల గిరులపైకి ఇంకో రహదారి అర్జెంట్ గా అవసరమైందా? నిజంగా…. అసలు నిజమేంటో తెలుసా? పై పెండింగ్ పనులేం చేసినా పైసా ప్రయోజనం రాదు. ఇందులో ఐతే కమీషన్లు దండిగా వస్తాయ్. ఆ పేరుతో స్వామి వారి నిధులు స్వాహా చెయ్యొచ్చు.

కరోనా లాక్ డౌన్ టైంలో తిరుపతిలో రోజుకి 50వేలమందికి షడ్రసోపేతంగా, పెళ్ళివిందులాగా అన్నదానం చేశారు. అన్నదానానికి అన్ని ఐటమ్స్ కావాలా? ఎవడబ్బ సొమ్మని దానం చేశారు? ఎవరికి దానం చేశారు? తిరుపతిలో కూటికి లేనివాళ్ళు 50వేలమంది ఎవరున్నారు? అయినదానికీ, కానిదానికీ స్వామివారి సొమ్ములు అప్పనంగా ఖర్చు చేసెయ్యటమేనా? ఇంతకీ అలా ఖర్చు చెయ్యటం వెనుక పరమార్థం ఎవరికైనా ఎరుకైందా? అందులో అయితే ఎంతమందికి వండారో… ఎంతమంది తిన్నారో ఎవరు చూడొచ్చారు? జేబులు నింపుకోవడానికి మంచి అవకాశం. ఇలాంటి పథకాలకైతే టీటీడీ అధికారులు కూడా బహు చురుగ్గా స్పందిస్తారండోయ్. అదే ఏ దళిత గోవిందమో అన్నామా? అబ్బో ఎన్ని అవాంతరాలు వచ్చి పడతాయో?

శ్రీవారి సొమ్ములైతే ఇలా మంచినీళ్ళలా ఖర్చు చేస్తున్న ఈ ప్రభుత్వాలు ఏనాడైనా చర్చి, మశీదుల నిధుల జోలికెళ్ళాయా? పైగా ప్రభుత్వ సొమ్ముతో ఆ మత మార్పిడి ముల్లాలకు, పాస్టర్లకు, జీతాలివ్వడం….. ఎంకరేజ్మెంట్ అనుకోవాలా? ఈ మధ్య 150 చర్చిలకు నిధులు మంజూరు చేశారు. ఏదో ఒక సాకుతో…. ఉన్న దేవాలయాలు కూల్చేస్తున్నారే గానీ క్రొత్త దేవాలయాలు నిర్మిస్తున్న పాపానబోతున్నారా? సరే చర్చిలకిస్తే ఇచ్చారు. జనాభా ప్రాతిపదికన అదే రేషియోలో హిందువులక్కూడా ఇస్తారా చెప్పండి? విచ్చలవిడిగా అన్య మత ప్రచారం, మత మార్పిడులు, అడ్డుకున్నవారిపై అక్రమ కేసులు. ఏ కాలంలో, ఏ దేశంలో, ఏ రాజ్యంలో ఉన్నాం మనం?

అరే… అంతెందుకు? దుండగులు అన్ని దేవాలయాలు ధ్వంసం చేశారే?…. అన్ని విగ్రహాలను పగులగొట్టారే? మన దేవుడు, ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దర్జాగా ఊరేగే ఆ పవిత్ర, పురాతన రథాలను నిలువున తగులబెట్టారే… “పాత రథం తగలడిపోతే క్రొత్త రథం వస్తుందిలే” అని ఏలికలు మన గాయాన్ని మరింతగా కెలికి పుండు చేశారే…. అయ్యో….. నా చేత్తో వ్రాయాల్సొస్తోందే… మన్నించు పరమేశ్వరా….. చివరికి… పవిత్ర దేవతా విగ్రహాలకు అశుద్ధం పూసి అపవిత్రం చేశారే…. ఇప్పటికీ…. రాష్ట్రంలో ఎక్కడో, ఏదో మూల మనం యుగయుగాలుగా, తరతరాలుగా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించుకుంటూ వస్తున్న మన పవిత్ర దేవతా విగ్రహాల పవిత్రతకు విఘాతం కలుగుతూనే ఉన్నదే…. మన ఆచారాలకు, సాంప్రదాయాలకు, జీవన విధానానికి నిత్యం అవమానాలూ, అవహేళనలూ ఎదురవుతూనే ఉన్నాయే… అపహాస్యం చేసే కుక్కలు మొరుగుతూనే ఉన్నాయే…. ఒక్కరంటే ఒక్కరిపైనైనా చర్య తీసుకుందా ఈ ప్రభుత్వం? ఒక్కర్నైనా అరెస్టు చేసిందా కనీసం? అధికారంలోని పెద్దలు ఒక్కరంటే ఒక్కరైనా బాధ్యతాయుతంగా, భరోసానిచ్చేలా మాట్లాడారా?

ఇన్ని సమస్యలున్నాయి కదా? వీటినేనాడన్నా సమస్యలుగా, హిందూ సమాజానికి అవమానకరమైన విషయాలుగా భావించి, అవశ్యం పరిష్కరించి హిందూ సమాజం యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడి, హిందూ సమాజంలో ఆత్మ స్థైర్యాన్ని కల్పించే ప్రయత్నాన్ని ఈ ప్రభుత్వాలు ఏనాడన్నా చేశాయా? అరే… ఇన్ని జరిగితే… జరుగుతూంటే…. ఈ రాష్ట్రంలో హిందువులు ఏ హోప్ తో జీవించాలి? హిందువులలో ముందు ఆ భరోసాని కల్పించండి. “ఈ ప్రభుత్వం మత పక్షపాతాన్ని చూపదు. ఈ ప్రభుత్వంలో అందరికీ సమానంగా రక్షణ లభిస్తుంది. స్వేచ్ఛ లభిస్తుంది. ముఖ్యంగా హిందువులకు… గౌరవం లభిస్తుంది. హిందూ ఆలయాలకు, దేవీ దేవతల విగ్రహాలకు, పురాతన రథాలకు రక్షణ లభిస్తుంది”. అనే భరోసాను మాకు కల్పించండి. మా దేవాలయాలను, విగ్రహాలను ధ్వంసం చేసినవాళ్ళను, అపవిత్రం చేసిన వాళ్ళను, మా దేవాలయ రథాలను తగులబెట్టినవాళ్ళను, మమ్మల్ని, మా ఆచార సాంప్రదాయాలను బహిరంగంగా అపహాస్యం చేసిన, చేస్తున్నవారిని పట్టుకుని మా ముందు మోకాళ్ళపై నిలిపి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. మా దేవునిపై నమ్మకం లేకపోయినా, మా దేవుని ప్రసాదాన్ని ముట్టుకోకపోయినా సిగ్గూ ఎగ్గూ లేకుండా మా దేవాలయాలలో పనిచేస్తూ, మేము మా దేవునికి భక్తిగా సమర్పించే కానుకల నుంచే జీతభత్యాలు స్వీకరిస్తూ కూడా ఆ విశ్వాసం లేకుండా స్వామి ద్రోహానికి పాల్పడే ఆ అన్యమత ఉద్యోగులను తొలగించి మీది నిష్పాక్షిక పాలన అని నిరూపించుకోండి. ఇవన్నీ చేశాకే…ఇంకేవైనా పథకాలు, క్రొత్త నిర్మాణాల జోలికెళ్ళే అర్హతొస్తుంది ఈ ప్రభుత్వానికి నా దృష్టిలో. సర్వే సుజనా సుఖినోభవంతు. అవును… మంచివాళ్ళు బాగుండాలి. మంచివాళ్ళు మాత్రమే బాగుండాలి.

– శ్యాంప్రసాద్ రెడ్డి కోర్శిపాటి.