News

హైదరాబాద్ మదర్సాలో 10 ఏళ్ళ బాలుడిపై అత్యాచారం!

524views
  • మతాధికారి షోయబ్ అక్తర్ అరెస్ట్

భాగ్య‌న‌గ‌రం: హైదరాబాద్‌లో ఘోరం జ‌రిగింది. ఓ మ‌ద‌ర్సాలో 10 ఏళ్ళ బాలుడిపై అత్యాచారం జ‌రిగింది. ఇందుకు కార‌కుడైన మత గురువు షోయబ్ అక్తర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

మదర్సాలో అరబిక్‌ బోధించే అక్తర్ రోజూ ఆ బాలుడిపై అత్యాచారానికి పాల్పడేవాడు. ఈ నెల ఆరోతేదీన తన ప్రైవేట్ పార్ట్స్‌లో నొప్పి రావడంతో బాలుడు తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. త‌ల్లిదండ్రులు రక్తస్రావం, ప్రైవేట్ భాగాలలో వాపును కూడా గమనించారు.

మైలార్‌దేవపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయ‌డంతో అక్తర్‌ను దారుల్ ఉలూమ్ మదర్సా నుంచి అరెస్టు చేశారు. మదర్సాలోనే ఈ నేరం జరిగింది. ఈ ఘటనను ఎవరికీ చెప్పవద్దని అక్తర్ బాలుడిని బెదిరించేవాడు.

యూపీలో…

యూపీలోని మెయిన్‌పురిలో మసీదులో ఎనిమిదేళ్ళ‌ బాలికపై జనవరి 26న ఇమామ్ జమాల్ అహ్మద్ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలికి నొప్పి క‌ల‌గ‌డంతో విల‌విల‌లాడిపోయేది. ఇలా చాలా మ‌ద‌ర్సాల్లో ఘోరాలు జ‌రిగిపోతున్నాయి.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి