News

నెహ్రూ వైఫల్యం వల్లే గోవా స్వాతంత్ర్యం ఆలస్యం: మోదీ

502views

మపుసా: నెహ్రూ తల్చుకొని ఉంటే గోవాను భారత్​లో విలీనం చేసుకునేందుకు కొన్ని గంటల సమయమే పట్టేదని ప్రధాని మోడీ అన్నారు. కానీ, పోర్చుగీసు పాలన నుంచి గోవాకు విముక్తి లభించడానికి 15 ఏళ్ళు పట్టిందని పేర్కొన్నారు.

గోవాలోని మపుసా ప్రాంతంలో నిర్వహించిన సభలో పాల్గొన్న మోదీ గోవాను కాంగ్రెస్ పార్టీ తన శత్రువులా భావిస్తోందని మండిప‌డ్డారు. అందుకే రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితిని సృష్టిస్తోందని ఆరోపించారు. గోవా సంస్కృతి, ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. గోవా పట్ల కాంగ్రెస్‌కు​ శత్రుత్వమే ఉంది. చారిత్రకంగా రెండు వాస్తవాలను దేశ ప్రజలకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. రెండు రోజుల కింద‌ట ఆ వాస్తవాల గురించి, గోవా విముక్తి ఉద్యమాన్ని ఎలా కాంగ్రెస్ అణచివేసిందో అనే వివరాల గురించి నేను పార్లమెంట్​లో మాట్లాడాను.

స్వాతంత్ర్యం వచ్చిన 15 ఏళ్ళ‌ తర్వాత భారత్​లో గోవా విలీనమైందని చాలా మందికి ఇప్పటికీ తెలీదు. అప్పుడు మనకు సైనిక శక్తి ఉంది. బలమైన నావికా దళం ఉంది. కొన్ని గంటల్లోనే ఆ పని(పోర్చుగీసు పాలన నుంచి గోవాకు విముక్తి) పూర్తయ్యేది. కానీ, అందుకు కాంగ్రెస్ పార్టీ 15 ఏళ్ల వరకు ఏమీ చేయలేకపోయిందని మోదీ పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి