
202views
-
మానవ హక్కుల ఉల్లంఘనపై కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్ ఘాటు విమర్శ
న్యూఢిల్లీ: 2022 బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌ను ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్, కెనడా దేశాలు దౌత్యపరంగా బహిష్కరించాయి. ఈ మేరకు ఆయా దేశాధినేతలు ప్రకటనలు చేశారు. అగ్రరాజ్యం తరహాలోనే తమ దేశ అథ్లెట్లు ఒలింపిక్స్‌లో పాల్గొంటారు కానీ ప్రభుత్వ అధికారులను మాత్రం చైనాకు పంపమని ప్రకటించారు. చైనాలో మానవ హక్కుల ఉల్లంఘనపై ఆందోళన వ్యక్తం చేశారు. చైనా పదేపదే మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడటాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నట్టు కెనడా తెలిపారు.