News

హెలికాప్టర్‌ ఘటనను రికార్డ్‌ చేసిన పర్యాటకులు

92views

చెన్నై: తమిళనాడు కున్నూరు సమీపంలోని నీలగిరి కొండల్లో ఎగురుతున్న సైనిక హెలికాప్టర్‌ ప్రమాద దృశ్యాన్ని కొంతమంది పర్యాటకులు తమ ఫోన్‌లలో రికార్డు చేశారు. ఎగురుతున్న హెలికాప్టర్‌ను వారు ముందుగా చూశారు. దీంతో ప్రమాదం జరుగుతున్నట్టు అనుమానించి, వీడియో రికార్డు చేశారు. కొందరు పర్యాటకులు నీలగిరి కొండలను క్యాప్చర్‌ చేస్తుండగా ఈ సీన్‌ క్యాప్చర్‌ చెయ్యగలిగారు.

అక్కడి పొగమంచు చాలా క్లియర్‌గా కనిపిస్తోంది. చక్కర్లు కొడుతూ వెళ్లిన హెలికాప్టర్‌ ఒక్కసారిగా మంచులోకి వెళ్లిపోయింది. ఆ వెంటనే పెద్ద శబ్దం వచ్చింది. అప్పటికే క్యాప్చర్‌ చేస్తున్న వాళ్లు ప్రమాదం జరిగిందని గ్రహించారు. అక్కడికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఇదిలావుండగా, కోయంబత్తూరు సమాచారం ప్రకారం.. ప్రమాదానికి కాసేపటికి ముందు కంట్రోల్‌ రూమ్‌తో సంబంధాలు తెగిపోయాయి. అదే టైమ్‌లో పొగమంచుతో కూడిన మేఘాలు కమ్మేశాయి. ముందుకు వెళ్తున్న హెలికాప్టర్‌కు ఎదురుగా ఉన్నది ఏంటో తెలిసే పరిస్థితి లేకపోయింది.

ఫలితంగా కొండల్లో ఉన్న చెట్లను ఢీకొట్టి మంటలతో కూలిపోయింది హెలికాప్టర్‌. ఆ ప్రమాదం జరుగుండగానే ఐదారుగురు మంటలతోపాటే కిందకు దూకేశారని ప్రత్యక్ష సాక్షులూ చెబుతున్నారు. కానీ ప్రయోజనం లేకపోయింది. తీవ్ర గాయాలు, 90 శాతం మేర కాలిన గాయాలతో చనిపోయారు.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి