News

నేడు ఆన్‌లైన్‌లో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు విడుదల

648views

తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనం కోసం డిసెంబర్ నెలకు సంబంధించిన సమయనిర్దేశిత(స్లాటెడ్) సర్వదర్శనం టోకెన్లు 27వ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ఆన్ లైన్‌లో విడుదల చేస్తారు. తిరుమలలో వసతికి సంబంధించి డిసెంబర్ నెల కోటాను ఈనెల 28వ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ఆన్ లైన్‌లో విడుదల చేయ‌నున్న‌ట్టు టిటిడి తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గుర్తించి స్వామివారి దర్శనం టోకెన్లు, తిరుమలలో వసతి బుక్ చేసుకోవాలని టిటిడి కోరుతోంది.

Source: TTD NEWS

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి