News

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

368views
  • రాయలసీమ, దక్షిణ కోస్తాకు వర్ష సూచన

అమరావతి: దక్షిణ అండమాన్‌ వద్ద బంగాళాఖాతంలో ఈ నెల 29నాటికి ఈ అల్పపీడనం ఏర్పడొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. 48 గంటల్లో ఇది బలపడి పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించొచ్చని అంచనా వేస్తున్నారు. 26న ఉత్తర కోస్తాలో తేలికపాటినుంచి మోస్తరు.. ఒకటి, రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది.

దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షాలతోపాటు ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురవొచ్చని అంచనా. 27న ఉత్తర కోస్తాలో తేలికపాటి వర్షాలతోపాటు ఉరుములతో కూడిన జల్లులు పడనున్నాయి. దక్షిణ కోస్తా, రాయలసీమలో తేలికపాటినుంచి మోస్తరు వర్షాలు అనేక చోట్ల పడనున్నాయి. 28న రాష్ట్రమంతటా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, దక్షిణ కోస్తాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడొచ్చని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అంచనా వేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి