
799views
న్యూఢిల్లీ: వివాదాస్పదమైన ట్రిపుల్ తలాక్‌పై ఈ నెల 27న తేదీన చర్చ జరగనుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ముస్లిం వుమెన్ ప్రొటెక్షన్ బిల్లుపై ఆ రోజున లోక్‌సభలో చర్చ జరగనుంది. ఆ బిల్లుపై చర్చించాలని కాంగ్రెస్ ఎంపి మల్లికార్జున ఖర్గే ఇవాళ స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను కోరారు. ట్రిపుల్ తలాక్ బిల్లుపై అభిప్రాయాలు వెలిబుచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ఆ సమయంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. సభ శాంతియుతంగా జరిగేందుకు అవకాశం ఇస్తే, కచ్చితంగా ట్రిపుల్ తలాక్‌పై చర్చిస్తామన్నారు. ట్రిపుల్ తలాక్ బిల్లుపై వ్యతిరేకంగా తీర్మానాన్ని వేయాలని నిర్ణయించినట్లు ఎంపి ఎన్‌కే ప్రేమ్‌చంద్రన్ తెలిపారు.
Source: News hunt.





