News

పాకిస్తాన్‌కు ఆర్థిక సాయం ఉండ‌దు!

699views
  • ఏఫ్‌టీఏఫ్ వెల్ల‌డి

న్యూఢిల్లీ: ఉగ్ర‌వాదుల‌ను పెంచిపోషిస్తున్న‌ పాకిస్తాన్ దేశానికి ఇది పిడుగుపాటు! అంతర్జాతీయ ఆర్థిక సాయం పొందే విషయంలో పాకిస్థాన్​కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశాన్ని ‘గ్రే’ లిస్టులోనే కొనసాగించాలని ఫైనాన్షియల్​ యాక్షన్​ టాస్క్ఫోర్స్ (FATF) నిర్ణయించింది. నిర్దేశించిన 34 విధుల్లో 30 విధులను మాత్రమే నిర్వర్తించినందున ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వర్చవల్​గా నిర్వహించిన ప్లీనరీ సమావేశంలో ఎఫ్​ఏటీఎఫ్​ అధ్యక్షుడు మార్కస్ ప్లీయర్ తెలిపారు. ఐక్యరాజ్య సమితి గుర్తించిన ఉగ్రవాదులు హఫీజ్​ సాయిద్, మసూద్ అజర్ సహా వారి బృందాలకు వ్యతిరేకంగా తీసుకుంటున్న చర్యలను పాక్​ పెంచాల్సిన అవసరం ఉందని ఎఫ్​ఏటీఎఫ్​ పేర్కొంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి