సేవ ముసుగులో క్రైస్తవ సంస్థల యొక్క నిజ స్వరూపం మరో సారి బయట పడింది: ఒడిశాలోని గుడ్ న్యూస్ ఇండియా సంస్థ నిర్వాకం.

సేవ పేరుతో క్రైస్తవ సంస్థలు చేస్తున్న దురాగతాలకు ఓడిశాలో జరిగిన ఈ తాజా ఘటన ఓ ఉదాహరణ. గుడ్ న్యూస్ ఇండియా అనే ఒక క్రైస్తవ NGO నడిపే ఒక వసతి గృహంలో అభ్యంతరకర కార్యకలాపాలకు పాల్పడుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఒడిశాలోని ధేన్కనల్ జిల్లా బెల్తికిరి గ్రామంలో సాదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆ వసతి గృహంలో వసతి పొందుతున్న అమ్మాయిల ఫిర్యాదుతో మొట్ట మొదటగా ఆ వసతి గృహంలో జరిగే లైంగిక అకృత్యాలు వెలుగు చూశాయి. అంతే కాకుండా అక్కడ బలవంతపు మత మార్పిడులకు పాల్పడుతున్నట్టు కూడా తెలియ వచ్చింది. అంతే కాకుండా అక్కడి నుంచి పసి పిల్లల్ని వేరే రాష్ట్రాలకు కూడా తరలిస్తున్నట్టు ఆధారాలు లభ్యమైనాయి. దీంతో ఆ వసతి గృహ నిర్వాహకులను కఠినంగా శిక్షించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఫయాజ్ రెహ్మాన్ ను, ఇంచార్జ్ సిమాన్చల్ నాయక్ ను, వారి సహచరుడు ఉదిత్ లిమాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆసక్తికరమైన అంశమేమిటంటే రాష్ట్రం మొత్తం మీద 26 శాఖలతో విస్తరించియున్న ఈ సంస్థ ఎలాంటి అనుమతులూ లేకుండానే నడుస్తూండం గమనార్హం. ఆ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి ప్రఫుల్ల సమాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ సంస్థ నడుపుతున్న అన్ని వసతి గ్రుహాలనూ పరిశీలించి, పరిశోధించి తగిన అనుమతులు లేవని నిర్ధారణ అయితే వాటన్నిటిని వెంటనే మూసివేయవలసినదిగాను, ఆయా వసతి గృహాల్లోని పిల్లలకు తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయవలసిందిగాను అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించటం జరిగిందని తెలిపారు. ఇందుకు బాధ్యులైన నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తమ యజమాని రెహమాన్ సాహెబ్ వసతి గృహంలోని ఆడ పిల్లల్ని గాఢంగా హత్తుకోవడం, ముద్దు పెట్టుకోవడం తాను ఎన్నో సార్లు చూశానని, ఏదైనా విశేషమైన కార్యక్రమాలు వున్నప్పుడు కొందరు విదేశీయులు కూడా వసతి గృహానికి వస్తుంటారని, వారు కూడా పిల్లలతో అభ్యంతరకరంగా ప్రవర్తించటం, వారిని హింసించటం తాను రెండేళ్లుగా చూస్తున్నానని అక్కడి వంట మనిషి పితాబస్ దిగాల్ స్పష్టం చేశారు.
వసతిగృహానికి బాలల సంక్షేమ శాఖ అధికారులు వచ్చిన సందర్భంలో వసతి గృహంలోని పిల్లలకు వారం వారం చికెను, చేప, గుడ్డు వంటి పదార్థాలతో కూడిన రుచికరమైన భోజనాన్ని పెడుతున్నట్టు, పాస్టర్ పిల్లలతో ఏకాంతంగా గడిపే సమయంలో పిల్లల చదువులు, ఇతర బాగోగుల విషయం మాత్రమే మాట్లాడతారని, ఆడ పిల్లల్ని కౌగిలించుకోవటం, ముద్దుపెట్టుకోవటం వంటివి చెయ్యరని, అంతే కాకుండా బాప్తిజం గురించి తమకేమీ తెలియదని చెప్పేలా చూడాలని వసతి గృహ నిర్వాహకులనుద్దేశించి ఆ సంస్థ అంతర్గత వ్యవహారాలను చూసే ప్రమోద్ రౌల్ అనే ఒక ఆడిటర్ తన రహస్య ఈ మెయిల్ ద్వారా పంపిన సందేశంలో పేర్కొనడం విశేషం.
పోలీసులు విచారణకు అక్కడికి వెళ్ళినప్పుడు ఇద్దరు ముగ్గురు చిన్నారులు కనిపించకుండా పోవడం పోలీసులను ఆశ్చర్యానికి గురి చేసింది. వారిని ఇతర రాష్ట్రాలకు తరలించినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. పేద కుటుంబాలకు చెందిన చిన్నారులను ముందుగా మతం మార్చిన తర్వాతే తమ వసతి గృహాలలో చేర్చుకుంటున్న దృశ్యాలు ఒడిశా రాష్ట్రమంతటా సామాజిక మాధ్యమాలలో వైరల్ అయినాయి. ఆ వీడియోలలో సంస్థ అధినేత ఫయాజ్ రెహ్మాన్ చిన్నారులను మతం మారుస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
కాగా ఈ అంశాన్ని తెలుసుకున్న ఆ రాష్ట్ర బీ.జే.పీ మహిళా మోర్చా బృందం ఆ వసతి గృహాన్ని సందర్శించి అక్కది పిల్లల్ని, పనివాళ్ళని, పరిసర ప్రాంతాలలోనివారిని విచారించి ఆ సంస్థ నిర్వాహకులు అక్కడి పిల్లలపై లైంగిక అత్యాచారాలు, బలవంతపు మత మార్పిడులకు పాల్పడుతున్నట్టుగా నిర్ధారించారు. రాష్ట్రంలోని మొత్తం 26 అనుమతి లేని వసతి గృహాలలో జరుగుతున్న అకృత్యాలు విదేశీ శక్తుల యొక్క పర్యవేక్షణలో రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసే జరుగుతున్నాయని ఆరోపించారు. అంతే కాకుండా విదేశీయులు వసతి గృహాన్ని సందర్శించిన సమయాలలో పిల్లల్ని వేధించటం ఇక్కడ పరిపాతని కూడా ఆమె ఆరోపిస్తున్నారు.
SOURCE: VSK BHARATH.