
622views
-
సమరసత సేవా ఫౌండేషన్ నిర్మించిన దేవాలయాల నుంచి బస్సుల ఏర్పాటు
తిరుమల: తిరుమల బ్రహ్మోత్సవాల్లో వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు శ్రీవారి దర్శనం కల్పించాలని తితిదే నిర్ణయించింది. రోజుకు వెయ్యి మందికి శ్రీవారి దర్శనం ఉంటుందని అధికారులు తెలిపారు. తితిదే ఆర్థిక సహకారంతో సమరసత సేవా ఫౌండేషన్.. ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార కాలనీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 500కు పైగా ఆలయాలు నిర్మించింది.
ఈ ప్రాంతాల్లోని ప్రజలకూ శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. ఈ నెల 7 నుంచి 14 వరకు శ్రీవారి దర్శనం కల్పించనున్న తితిదే… రోజుకు వెయ్యిమందికి ఉచిత రవాణా, భోజనం, వసతి సౌకర్యం ఏర్పాటు చేసినట్టు వెల్లడిరచింది.