News

ఆ డ్రగ్‌ కంటైనర్లు ఆఫ్గనిస్థాన్‌ నుంచి వచ్చినవే…

325views

విజయవాడ: గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో రూ.9వేల కోట్ల విలువైన మాదకద్రవ్యాలను డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ ఇటీవల పట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ డ్రగ్స్‌ ముఠాకు విజయవాడకు చెందిన ఓ ట్రెడిరగ్‌ సంస్థతో సంబంధాలు ఉన్నట్టు పేర్కొన్నారు.

ముంద్రా నౌకాశ్రయానికి నిషేధిత మాదకద్రవ్యాలతో వచ్చిన రెండు షిప్‌ కంటైనర్లు ఆఫ్గనిస్తాన్‌ నుంచి వచ్చేనవేనని అధికారులు తెలిపారు. టాల్కమ్‌ పౌడర్‌ తరలిస్తున్నట్టు వాటి పత్రాల్లో పేర్కొనగా.. అనుమానంతో అధికారులు తనిఖీలు చేపట్టడంతో అసలు విషయం పొక్కింది.

ఈ కంటైనర్లు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన ఆషి ట్రేడిరగ్‌ సంస్థకు చెందినవిగా గుర్తించారు. గుజరాత్‌ ఢల్లీి, చెన్నై, అహ్మదాబాద్‌, మాండ్వి ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఇంకా విచారణ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి