News

క్రైస్తవ పాస్టర్లకు జీతాలపై పిల్‌

742views

అమరావతి: ఆంధ్ర రాష్ట్రంలో క్రైస్తవ పాస్టర్లకు నెలనెలా జీతాలిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు అయ్యింది. సామాజిక సంస్థ లీగల్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ ఫోరమ్‌ ఈ మేరకు ఏపీ హైకోర్టులో పిల్‌ దాఖలు చేసినట్టు ప్రకటించింది. రాష్ట్రంలోని క్రైస్తవ పాస్టర్లకు ఆర్థిక సహాయం పేరిట వారికి నెలనెలా రూ.5వేలు చొప్పున చెల్లించే విధంగా నిర్ణయం తీసుకుంది.

ప్రజల పన్నుల నుండి ఒక మతానికి చెందిన ప్రచారకులకు ఆర్థిక సహాయం కల్పించడం రాజ్యాంగ విరుద్ధం, సెక్యులరిజం స్ఫూర్తికి విరుద్ధం అని సర్వత్రా విమర్శలు తలెత్తాయి. ఈక్రమంలో లీగల్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ ఫోరమ్‌ పిల్‌ దాఖలు చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి