News

కరోనా మూడో దశను సమర్థంగా ఎదుర్కొందాం… ఆరోగ్య భారతి ఆధ్వర్యంలో శిక్షణ

600views

రోగ్య రక్ష సమితి ప్రాంత ప్రశిక్షణ వర్గ ఆగస్టు 7న విజయవాడ హైందవిలో నిర్వహించారు. .కోవిడ్ మూడో దశను ఎదుర్కోవడానికి యావత్ సమాజాన్ని సిద్ధం చేస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కరోనా వ్యాప్తి చెందకుండా సమాయత్తం చేసే ప్రయత్నంలో భాగంగా అన్ని జిల్లాల నుంచి వచ్చిన 90 మంది కార్యకర్తలకు డాక్టర్ పి ఎస్ రావు శిక్షణ ఇచ్చారు. అనంతరం డాక్టర్ మురళీకృష్ణ యోగ ద్వారా వ్యాధి నిరోధక శక్తి ఎలా పెంచుకోవాలనే అంశంపై పలు సూచనలు చేశారు. జిల్లా వారీగా పది మంది సభ్యులతో కమిటీని వేసి తద్వారా మండల గ్రామాలలో కరోనా పై అవగాహన కల్పించాలని వక్తలు సూచించారు.

26 వేల ఎనిమిది వందల ఎనభై మంది కార్యకర్తలతో 6823 గ్రామాలలో కోవిడ్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జన జాగరణ కార్యక్రమము సెప్టెంబర్ 1 నుండి 7 వరకు చేపట్టాలని.. అందులో భాగంగా 3232 గ్రామాలలో 100% వ్యాక్సినేషన్ వేయించాలని సమావేశంలో తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య భారతి అఖిలభారత కార్యదర్శి డాక్టర్ మురళి కృష్ణ, ఆరోగ్య భారతి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పి ఎస్ రావు, ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రచారక్ భరత్, దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారక్ శ్రీ సుధీర్, ఆంధ్రప్రదేశ్ సహ ప్రాంత ప్రచారక్ శ్రీఆదిత్య, ప్రాంత కార్యవాహ శ్రీ వేణుగోపాల్ నాయుడు, సహకార్యవాహ శ్రీ యుగంధర్, సేవా భారతి రాష్ట్ర సంఘటనా కార్యదర్శి శ్రీ కాకాని పృథ్వీరాజు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.