News

శ్రీలంక తీరాల్లోకి చొరబడ్డ చైనా.. అభివృద్ధి కార్యకలాపాల పేరుతో కుట్ర.. అప్రమత్తమైన భారత నౌకాదళం

301views

శ్రీలంకలో చైనా చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు భారత్కు ముప్పు కలిగించవచ్చని నావికాదళం పేర్కొంది. చైనా కార్యకలాపాలను నిశితంగా గమనించాల్సిన అవసరం ఉందని చెప్పింది. ఈ మేరకు ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత నావికాదళ వైస్ చీఫ్, వైస్ అడ్మిరల్ జి.అశోక్ కుమార్ తెలిపారు. భారత తీరప్రాంత సరిహద్దులను రక్షించటంలో నౌకాదళం సర్వసన్నద్ధంగా ఉందన్న ఆయన…. ఎవరూ కూడా ఈ మార్గాల్లో అలజడి సృష్టించలేరని పేర్కొన్నారు.

శ్రీలంకలో చైనా చేపడుతున్న ప్రాజెక్టులు.. భారత్కు ముప్పా? కాదా? అనేది కష్టతరమైన ప్రశ్నే. ఈ ప్రాంతానికి చెందని వారు ఇక్కడ అధిక ఆసక్తి చూపిస్తున్నారంటే.. ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే కాబట్టి.. భారత్కు చైనా చర్యలు ముప్పు కలిగించవచ్చు. అందుకే మనం ఈ ప్రాంతాన్ని నిశితంగా గమనిస్తూ ఉండాలని ఆయన తెలిపారు.

శ్రీలంక తీరాల్లోకి చైనా చొరబడిందని వైస్ అడ్మిరల్ అశోక్ కుమార్ తెలిపారు. 26/11 ముంబయిపై దాడి తర్వాత భారత్… తీర ప్రాంతాల్లో భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసిందని, నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసిందని పేర్కొన్నారు. గత పదేళ్ల కంటే భారత నావికా దళం ప్రస్తుతం చాలా అభివృద్ధి చెందిందని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.