
590views
జి-7 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ వర్చువల్‌గా పాల్గొననున్నారు. శని ఆదివారాల్లో జరిగే సమావేశాలకు హాజరుకానున్నారు. బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, కెనడా సభ్య దేశాలుగా ఉన్న ఈ కూటమి సమావేశాలు శుక్రవారం ఆరంభం కానున్నాయి. ఆతిథ్య బ్రిటన్.. ప్రత్యేక ఆహ్వానితులుగా భారత్, ఆస్ట్రేలియా, దక్షిణకొరియా, దక్షిణాఫ్రికాలను పిలిచింది. కరోనా పరిస్థితుల దృష్యా ప్రధాని మోడీ.. బ్రిటన్ వెళ్లరని గత నెలలోనే విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది.





