పౌర హక్కుల గురించి లెక్చర్లు దంచే మేధావులకు జూన్ 4 వ తేదీ ప్రత్యేకత గుర్తు లేదా???
కనీస హక్కులు కావాలన్న విద్యార్థులను నిర్దాక్షిణ్యంగా చంపించేసిన ఘటన మదిలోకి రాదా???
తియనన్మన్ స్క్వేర్ లో రోడ్డు మీద ఉన్న ప్రజల మీదకు ట్యాంకర్లు పంపించి తొక్కించిన ఘటనకు 32 ఏళ్లు..!
పరిపాలనా సంస్కరణల అమలులో జరుగుతున్న జాప్యం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న ప్రజానీకం తమ కోపాన్ని వెళ్లగక్కెందుకు ఏప్రిల్, 1989లో చైనాలోని బీజింగ్ లో ఉన్న తియనన్మన్ స్క్వేర్ లో ప్రదర్శనలు ప్రారంభించారు. ఉదారవాద కమ్యూనిస్ట్ నాయకుడైన హు యోబాంగ్ మరణానానికి సంతాపం ప్రకటించారు కూడా. ఆ ప్రధర్శన క్రమంగా శాంతియుత నిరసనలుగా చైనాలోని అన్ని ప్రాంతాలకు విస్తరించాయి. ఈ ప్రదర్శనల్లో ఎక్కువగా విద్యార్ధులు పాల్గొన్నారు. ప్రభుత్వంలో అవినీతిని అంతం చేయడం, రాజకీయ, ఆర్ధిక సంస్కరణలు వారి ప్రధాన డిమాండ్లు.
సైనికపాలనను కఠినంగా అమలుచేయడం కోసమంటూ ప్రభుత్వం వేలాదిమంది సైనికులను, వందలాది సాయుధ వాహనాలను తియనన్మన్ స్క్వేర్ కు తరలించింది. బీజింగ్ వీధుల్లో నిరసనకారులను పూర్తిగా తొలగించడమే సాయుధ బలగాల పని.
తియనన్మన్ స్క్వేర్ చేరగానే సైనిక బలగాలు ప్రదర్శనకారులపై విచక్షణారహితంగా కాల్పులు మొదలుపెట్టాయి. ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండానే కాల్పులు ప్రారంభమయ్యాయి. ఆ కాల్పులలో వేలాది మంది మృతి చెంది ఉంటారని అంచనా.
ప్రదర్శనల తరువాత అణచివేత
సైనికచర్య ద్వారా తియనన్మన్ స్క్వేర్ ప్రజాస్వామ్య ప్రదర్శనలను అణచివేసిన చైనా ప్రభుత్వం ఆ తరువాత ప్రదర్శనల్లో చురుకుగా పాల్గొన్నవారిని వేటాడటం మొదలుపెట్టింది.`విప్లవ ద్రోహానికి’ పాల్పడ్డారంటూ వేలాదిమందిని నిర్బంధించి, హింసించి, జైళ్ళలో కుక్కింది లేదా చంపేసింది.
ఎంతమందిని జైళ్ళలో నిర్బంధించారో, ఎంతమందిపై విచారణ సాగించారో, ఎంతమందికి మరణ శిక్ష అమలు చేశారో చైనా అధికారులు ఇప్పటివరకూ బయటపెట్టలేదు.
ఈ అమానుషమైన, భయానక దమనకాండకు భయపడి ప్రదర్శనల్లో తమ సన్నిహితులను కోల్పోయినవారు కూడా ఇదేమి అన్యాయమని అడగలేక మౌనం వహించారు. అంతేకాదు చనిపోయిన తమవాళ్ళ గురించి కనీసం బహిరంగంగా మాట్లాడుకోలేని పరిస్థితి. ప్రదర్శనకారులందరినీ ప్రభుత్వం `అల్లరిమూకలు’ అని ముద్రవేసింది.
దమనకాండ గురించి మాట్లాడటానికి వీలులేదు
తియనన్మన్ స్క్వేర్ దమనకాండ గురించి చర్చించడంకానీ, మాట్లాడటం కానీ చైనాలో నిషేధం. ఎంతమంది చనిపోయారన్నది ప్రభుత్వం ప్రకటించలేదు. నాటి ప్రజాస్వామ్య ఉద్యమాన్ని గుర్తుచేసుకుంటూ సభలు, సమావేశాలు కూడా నిర్వహించడానికి వీలులేదు. అలాంటి ప్రయత్నాలను చైనా ప్రభుత్వం ఏమాత్రం సహించదు. ఎవరైనా ప్రభుత్వ సమాచారాన్ని, వాదనను అంగీకరించవలసిందే.
Source : VSK TELANGANA
Video courtesy : Nijam today
వేల మంది రక్తంతో తడిసిన చరిత్ర చైనా నరమేధానికి 32ఏళ్లు I Nijam Today – YouTube