NewsSeva

సేవా భారతి ఆధ్వర్యంలో అంబులెన్స్ ప్రారంభం…..

451views

రోజు గుంటూరులో సేవా భారతి ఆధ్వర్యంలో అంబులెన్స్ వాహనము ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్ ఎస్ ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ కె ఎస్ ఎం చారి గారు, సహకార సంఘం డాక్టర్ రఘురాం రెడ్డి గారు, సేవా భారతి జిల్లా కార్యదర్శి శ్రీ రెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు డాక్టర్ హరిప్రసాద్ గారు, ప్రదీప్, జాగు శ్రీనివాస్, శేషారావు తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ డివి హరి ప్రసాద్ గారు మాట్లాడుతూ పేద, సామాన్య ప్రజానీకం కోవిడ్ సందర్భంగా ఉన్న డబ్బంతా హాస్పిటల్లో వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. “ఇంటి నుండి హాస్పిటల్ కి వెళ్లేటప్పుడు గానీ, హాస్పిటల్ నించి తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడుగానీ ఎక్కువ డబ్బులు ఖర్చుపెట్టే అవసరం లేకుండా తక్కువ ఖర్చుతో గుంటూరు పట్టణ పరిధిలోని పరిసర గ్రామాలలోనూ సేవాభారతి వారి అంబులెన్సు పనిచేస్తుంది” అని డాక్టర్ హరిప్రసాద్ తెలియజేశారు. ఈ అవకాశాన్ని అవసరమైన అందరూ ఉపయోగించుకోవాలి అని డాక్టర్ కే యస్ యన్ చారి గారు కోరారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.