ArticlesNews

“కరోనా కష్ట కాలంలో మనమే గెలుస్తాము – అపార ఆత్మ విశ్వాసంతో వ్యవహ రిద్దాం”

309views

నేటి కష్ట కాలంలో సమాజంలో సానుకూల వాతావరణాన్ని సృష్టించడానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు దేశ ప్రజలను ఉద్దేశించి మే 11 నుండి 15 వరకు సందేశం ఇచ్చారు.

వాటిలో ముఖ్యాంశాలు:

1) రాజకీయ విమర్శలు,ప్రతి విమర్శలకు ఇది సమయం కాదు,ఈ కష్ట కాలం ఏర్పడ దానికి గల మూల కారణాలను గురించిన చర్చ తర్వాత చేసుకుందాం!

2) మనస్సుని నీరస పరిచే వార్తలకు దూరంగా ఉండండి.

3) కష్ట కాలంలో నిరాశ నిస్పృహలకు, క్రోధానికి గురి కారాదు.మనస్సు బలహీనం అయితే ఆ దుష్పరణామాలు శరీరంపై ఉంటాయి.
రామాయణంలో హనుమంతుడు ఎనలేని ఆత్మ విశ్వాసంతో ధైర్యంతో వ్యవహరించాడు.
18 వ శతాబ్దం చివరి దశకంలో దేశమంతా ప్లేగు వ్యాధి వచ్చింది.లక్షల మంది చనిపోయారు.నాగపూర్ లో కేశవరావు చిన్న నాటనే తల్లి తండ్రులు ఇద్దరూ ఒకే రోజు ప్లేగు వ్యాధి వల్ల చని పోయారు.ఆ బాలుడు దుఖం లో మునిగి పోలేదు. క్రోదాని కి గురికాలేదు.ఆ కేశవరావు తరువాత అర్.ఎస్.ఎస్.ను స్థాపించారు.ఆత్మీయతకు,ఆత్మ విశ్వాసంకు వారు మారుపేరు.ఈ మహనీయుల నుండి మనం ఎనలేని ఆత్మ విశ్వాసంతో నేడు పని చేయాలి.

4)మనం అందరం రోజూ కొంత సేపు భజన,హనుమాన్ చాలీసా…..మొదలగునవి.,చేయాలి.

5) రోజు 10-15 నిమిషాలు శ్వాస క్రియకు సంబంధించిన వ్యాయామం చేయాలి.వీటి వల్ల కరోనా ను ఎదుర్కొనే శక్తి లభిస్తుంది.కరోనా బారి నుండి కాపాడు కోవడం కోసం వైద్యులు,ప్రభుత్వ అధికారులు చెప్పే అన్ని నియమాలను పాటించాలి.

6) అన్నిరకాల విభేదాలను మరచి అందరం కలసి పని చేయాలి.

7) కరోనా కాలంలో వైద్యులు
,వైద్య సిబ్బంది,పారిశుధ్య కార్మికులు,పోలీసులు ఎక్కువ సమయం ఇచ్చి ఎక్కువ పని చేస్తున్నారు.వారి శ్రమను మనం పంచుకోవాలి.వారి పై గల పని భారం తగ్గించాలి.

8)వ్యక్తులుగా,కుటుంబపరంగా, చిన్న చిన్న బృందాలుగా తోటి ప్రజలకు సహకరించాలి,సేవా కార్యక్రమాలు నిర్వహించాలి.

9)మన పురాణ కాలపు కథ ఒకటి ఉంది.దేవతలు రాక్షసులు పాల సముద్రం చిలుకుతున్నారు.ప్రారంభంలో భయంకర మైన హాలాహలం వచ్చింది.దానిని చూసి భయపడి పారి పోలేదు.
అయిరావతం వంటి,విలువైన వస్తువులు,వచ్చాయి.వాటి ఆకర్షణకు లోనూ కాలేదు.
అమృతం లభించెంత వరకు వారు తమ పనిని ఆపలేదు.

10) సత్యానికి,ధర్మానికి చివరకు విజయం లభించి తీరుతుంది.

11) ఈ దేశంలో మరణానికి భయపడే అలవాటు లేదు.సమయం వచ్చినప్పుడే మరణం వస్తుంది.నిర్ణయం అయిన సమయానికి ముందుగా ఎవరూ మరణించరు. మరణస్తే బాధ దేనికి? మళ్ళీ పుడతాం.

12) కరోనా వచ్చిన వారిలో అనేక మంది తిరిగి ఆరోగ్యవంతులు అవుతు న్నారు. చాలా తక్కువ మందే మరణిస్తున్నారు.

13) మనం జీవించడం ముఖ్యం.జీవన విధానం ముఖ్యం కాదు.పరిస్థితులకు అనుగుణంగా మనం జీవన విధానం మార్చు కోవాలి” అని ప్రముఖులు సందేశం ఇచ్చారు.

ఈ ఉపన్యాస ధారావాహికలో, సద్గురు జగ్గీ వాసుదేవజీ, పూజ్య జైనముని శ్రీ పరమాన సాగర్ జి, శ్రీశ్రీ రవిశంకర్ గురూజి, శ్రీ అజీమ్ ప్రేమ్‌జీ ( ప్రముఖ పారిశ్రామిక వేత్త) పూజ్య శంకరాచార్య విజయరేంద్ర సరస్వతిజీ,కంచి కామకోటి పీఠం, పద్మవిభూషణ్ సోనాల్ మాన్సింగ్ జి, సాద్వి రుతుంభర,మహంత్ జ్ఞాన దేవ్ జీ. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ జీ ప్రసంగించారు.

లెఫ్టినెంట్ జనరల్ శ్రీగుర్మీత్ సింగ్,కన్వీనర్, కోవిడ్ రెస్పాన్స్ టీం, ఢిల్లీ వారు ఈ కార్యక్రమాలను నిర్వహించారు.దేశ వ్యాప్తంగా నీ కాక ప్రపంచ వ్యాప్తంగా 100 పైగా ఛానళ్ల ద్వారా ప్రజలు విని ప్రేరణ పొందారు.

సేకరణ : శ్రీ శ్యామ్ ప్రసాద్, సామాజిక సమరసత

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.