News

అతనో హిందూ ద్వేషి. అతన్ని వెంటనే విధులనుంచి తొలగించండి : ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఫ్యాకల్టీ అభిజిత్ సర్కార్ విషయమై హిందువుల డిమాండ్

568views

హిందూ మతాన్ని పదేపదే దూషిస్తూ, భారత్ ను ద్వేషిస్తూ పోస్టులు పెడుతున్న ఓ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ని విధుల నుంచి తొలగించాలంటూ ఇంగ్లండ్ లోని పలువురు హిందువులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఆయనపై UK లో నివసిస్తున్న హిందూ సమాజం ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ యాజమాన్కియానికి అధికారికంగా ఫిర్యాదు చేసింది. హిందువైన రష్మీ సామంత్ ‌ను దూషించడం, వేధించడం వంటి ఆరోపణలు ఆయనపై ఉన్నాయి.

ఈ విషయమై ఇంగ్లాండ్ లోని హిందూ సమాజం మూడు డిమాండ్లను లేవనెత్తింది :

1) సోషల్ మీడియాలో అభిజిత్ సర్కార్ యొక్క విద్వేషపూరిత పోస్టులను పరిగణనలోకి తీసుకుని, అతను క్రమశిక్షణను అతిక్రమించినందుకుగానూ ఆయనపై వచ్చిన ఆరోపణలపై ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ దర్యాప్తు ముగిసే వరకూ తక్షణమే తనని విధుల నుండి సస్పెండ్ చెయ్యాలి.

2) లేదంటే ఆక్స్ఫర్డ్ తన సిబ్బందిలోని హిందూ వ్యతిరేక వైఖరిని సహిస్తున్నట్లవుతుంది.

3) తన సిబ్బందిలో హిందూ సమాజానికి వ్యతిరేకంగా….. ముఖ్యంగా బ్రిటిష్ హిందువులపై ద్వేషపూరిత ఆలోచనను వ్యాప్తి చేస్తున్న ఇతరులపై కూడా దర్యాప్తు చేయాలి.

హిందూ సమాజం, తన లేఖలో, అభిజిత్ సర్కార్ భారతదేశంపై వెల్లడి చేస్తున్న తీవ్ర ద్వేషాన్ని వాస్తవాలతో, ఆధారాలతో సహా చూపింది. అతని అకాడెమిక్ పేపర్లు చాలా కఠోర అబద్ధాలతో, సమాజంలో విభజన వాదాన్ని ప్రచారం చేసేవిగా ఉంటాయి. అతను తన సోషల్ మీడియా హ్యాండిల్స్ నుండి పంచుకున్న చాలా పోస్టులు తప్పుడువి మరియు హింసను ప్రేరేపించేవి.

తన లేఖలో, హిందూ సమాజం డాక్టర్ సర్కార్ యొక్క నకిలీ/ తప్పుడు ట్వీట్లను కూడా పొందుపరచింది. ఇది అతని భారత వ్యతిరేక వైఖరిని ప్రతిబింబిస్తుంది. అలాగే వారు డాక్టర్ సర్కార్ నుండి బహిరంగ క్షమాపణ కోరుతూ ఆన్‌లైన్ ప్రచారాన్ని కూడా ప్రారంభించారు.

Source : Organiser.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.