
బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్, హీరోయిన్ తాప్సీ నివాసాలపై ఆదాయపు పన్ను శాఖ జరిపిన దాడుల్లో వందలకోట్లు ఆదాయపు పన్ను ఎగ్గొట్టినట్లు ఆదాయపు శాఖ అధికారులు వెల్లడించారు.
“ఫాంటమ్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ హౌస్” భారీ ఆదాయాన్ని ఆర్జించినట్లు తేలింది. అయితే ఇది లెక్కల్లో వెల్లడించలేదని, కంపెనీ అధికారులు సుమారు 300 కోట్ల రూపాయలకు సరైన పత్రాలు చూపించలేకపోతున్నారని. ప్రొడక్షన్ కంపెనీ లావాదేవీలను తారుమారు చేసిందని. వాస్తవ విలువకు బదులుగా తక్కువ విలువ లెక్కల్లో చూపబడిందని.సుమారు రూ.350 కోట్ల రూపాయలకు పన్ను ఎగవేసినట్లు అధికారులు వెల్లడించారు. నటి తాప్సి అయితే కేవలం 5 కోట్ల రూపాయలకు మాత్రమే నగదు రశీదులు అందజేసింది. నటుడు, దర్శకుడు అనురాగ్ కాశ్యప్ 20 కోట్ల రూపాయల విలువైన నకిలీ పత్రాలు సమర్పించాడని తేలింది.తను మొత్తానికి కూడా కూడా పన్ను ఎగవేశాడు.నటి తాప్సీ విషయంలో కూడా ఇలాంటి సమస్యలే వెలుగులోకి వచ్చాయి. దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదు. త్వరలో పూర్తి వివరాలను అందిస్తామని ఐటి అధికారులు అన్నారు.
కాగా కశ్యప్ 2011లో ‘ఫాంటమ్ ఫిల్మ్స్’పేరిట ఒక నిర్మాణ సంస్థను స్థాపించారు.2018లో దీన్ని మూసివేశారు.అయితే ఈ సంస్థ పన్ను ఎగవేతకు పాల్పడినట్టు వచ్చిన ఆరోపణలపై ఐటీశాఖ దర్యాప్తు జరుపుతున్నది.అందులో భాగంగానే ఆ సంస్థ ప్రమోటర్లు అయిన అనురాగ్ కశ్యప్,దర్శకనిర్మాత విక్రమాదిత్య మోత్వానే,నిర్మాత వికాశ్ బెహల్,నటి తాప్సి,డిస్ట్రిబ్యూటర్ మధు మంతెన,రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సీఈవో శుభాషిశ్ సర్కార్ తదితరుల నివాసాలలో,ముంబై, పూణెలోని 30 కి పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించినట్టు చెప్పారు.టాలెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు ‘క్వాన్’,ఎక్సీడ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రతినిధుల కార్యాలయాల్లోనూ తనిఖీలు చేపట్టినట్టు పేర్కొన్నారు. ఉదయం ప్రారంభమైన సోదాలు రాత్రి పొద్దుపోయే దాకా కొనసాగాయి.పలు పత్రాలు,ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సీఈవో శుభాషిశ్ సర్కార్ తదితరుల నివాసాల్లో తెలిపారు. అనంతరం తాప్సీ, కశ్యప్ లను అధికారులు ప్రశ్నించారు.
ఇప్పుడేమంటారు? – బీజేపీ
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేవారిపై కక్ష కట్టి ఇలా దాడులు చేస్తున్నారని విపక్షాలు విమర్శించాయి. కావాలనే వారిని ఇబ్బంది పెట్టడానికి ఇలా దాడులు చేశారని మండిపడ్డాయి కూడా. అయితే ఐటి అధికారులు వాళ్ళు పన్ను ఎగ్గొట్టినట్లు స్పష్టమైన ఆధారాలు బయటపెట్టడంతో “ఇప్పుడేమంటారు?” అని బీజేపీ నాయకులు విపక్షాలను ప్రశ్నిస్తున్నారు.





