News

11 వ శతాబ్దపు మృత్యుంజయ ఆలయం ధ్వంసం

517views

త్తరాఖండ్ లోని ఆల్మోరా జిల్లాకు చెందిన ద్వారహత్ అనే చిన్న పట్టణంలో నిన్న 800 సంవత్సరాల నాటి పురాతన మృత్యుంజయ ఆలయాన్ని ధ్వంసం చేశారు. 11 వ శతాబ్దం నాటి ఈ పురాతన ఆలయాన్ని ఉత్తరాఖండ్ చెందిన కాట్యూరి రాజవంశం నిర్మించింది. దశాబ్దాలుగా ఈ ఆలయం భారత పురావస్తు శాఖ సంరక్షణలో ఉంది. అయినప్పటికీ స్థానికులు అక్కడ ప్రతిరోజూ పూజలు చేస్తారు. ద్వారాహత్ పట్టణం అనేక పురాతన దేవాలయాలకు ప్రసిద్ధి. ఎన్ని ఆలయాలు ఉన్నప్పటికీ మృత్యుంజయ ఆలయం మహిమాన్విత ఆలయంగా ప్రసిద్ధి చెందింది. 18 శతాబ్దంలో ఈ ఆలయం మీద అఫ్గాన్ రోహిల్లాలు దాడి చేశారు. కానీ అక్కడి ఆనాటి కుమాన్ సైన్యం ఎదురుతిరిగి ఆలయాన్ని సంరక్షించింది. అప్పటి నుండి ఈ ఆలయం నిరంతరం విశేషపూజలు అందుకుంటూ ఉంది.

బుధవారం నాడు కొందరు భక్తులు మృత్యుంజయ ఆలయ ప్రాంగణంలో ఉన్న భైరవాలయంలో పూజలు చెయ్యడానికి వెళ్ళినప్పుడు ఆలయంలోని శివలింగాన్ని కిందవరకు కోసి తీసుకెళ్లినట్లు గుర్తించారు.

పురాతత్వ శాఖ అధికారులు ప్రాంగణంలో ఉన్నప్పటికీ, ఈ దొంగతనం జరగడం గమనార్హం. ఈ దొంగతనం పగటిపూటే జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. సీసీటివి ఫుటేజ్ లో ఆలయం నుండి ఒక వ్యక్తి బ్యాగ్ తగిలించుకుని వెళ్లడాన్ని గుర్తించారు. కానీ ఈ విధ్వంసం ఒక వ్యక్తి చేసిన పని కాదని, ఇద్దరికి పైనే ఉంటారని పోలీసులు తెలిపారు.

పోలీసులు ఒక ప్రకటన విడుదల చేస్తూ.., నేరస్తులను త్వరలోనే పట్టుకుంటామని హామీ ఇచ్చారు. కానీ పట్టణ ప్రజలు ఇది ఇతర మతస్తులు చేసిన పని అంటూ కోపోద్రిక్తులయ్యారు. వారిని శాంతింపజేయడానికి పోలీసులు స్థానిక ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా…. తాము విచారణ చేసి ఘటన యొక్క పూర్తి వివరాలు త్వరలోనే తెలుసుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రజలు మత పరమైన ఉద్రిక్తలు వ్యాప్తి చేసే ప్రకటనలకు దూరంగా ఉండాలని పోలీసులు అభ్యర్ధించారు.

పోలీసు వారి ప్రకటన ప్రకారం “ఈ ఆలయం 11 వ శతాబ్దానికి చెందినదని కావడంతో, శివలింగ ఎగువ భాగం అంతర్జాతీయ మార్కెట్లో గణనీయమైన ధరను కలిగి ఉండవచ్చు.” అనే ఉద్దేశంతో తీసుకెళ్లి ఉండొచ్చు అంటున్నారు.
ఐపిసి 379, 427 కింద కేసు నమోదు చేశారు, పోలీసులు పెట్టిన సెక్షన్లను బట్టి దీనిని సాధారణ దొంగతనంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలుస్తోంది.

ఇందులో మతాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించే ప్రార్థనా స్థలం యొక్క విధ్వంసంగా వ్యవహరించే ఐపిసి సెక్షన్ 293 ను పోలీసులు చేర్చడం ఆసక్తికరంగా ఉంది. నిజానికి నేరపూరిత కుట్ర కోసం ఐపిసి 120 బిని పెట్టడానికి ఇది సరైన కేసు. ఎఫ్ఐఆర్ నమోదు చేసేటప్పుడు పోలీసులు ఈ విభాగాల నిబంధనలను ఎందుకు అమలు చేయలేదనే విషయం అర్థం కాలేదు.

నేడు భారత్ అంతటా హిందూ మత దేవాలయాలు దాడికి గురవుతున్నాయి. పోలీసులు దొంగలను పట్టుకుని కఠినమైన సెక్షన్లు పెట్టి శిక్షిస్తేనే వీటిని అరికట్టవచ్చు అని స్థానికుల అభిప్రాయం. ఉత్తరాఖండ్ దేవ భూమి కావడంతో కొంతకాలంగా హిందూ వ్యతిరేక శక్తుల ఇక్కడ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. బలమైన హిందూ ప్రతిస్పందన మాత్రమే మన దేవాలయాలను, మన నాగరికతను కాపాడుతుంది. దేవాలయాలు ఒకప్పుడు మన పట్టణాలకు కేంద్రంగా అలాగే మన సామాజిక జీవితానికి కేంద్రంగా ఉండేవి. హిందువులు దేవాలయాలను తిరిగి గొప్పగా చేయదగిన సమయం ఇదే.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.