NewsProgramms

ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణా తరగతులు ప్రారంభం

85views

సోమవారం 14.12.2020 వ తేదీన కర్నూలు జిల్లా, నంద్యాల ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో యానాది కాలనీ లో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభమైంది. రాష్ట్ర సేవికా సమితి కార్యకర్త శ్రీమతి జ్యోతి గారు పూజా కార్యక్రమం నిర్వహించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

కార్యక్రమంలో సంఘమిత్ర కార్యవర్గ సభ్యులు శ్రీమతి వెంకటేశ్వరి, టైలరింగ్ గురువు శ్రీమతి రమ, ఆర్ ఎస్ ఎస్ నగర సంఘచాలక్ శ్రీ చిలుకూరి శ్రీనివాస్, నగర ధర్మ జాగరణ ప్రముఖ్ శ్రీ చింతల పల్లె వాసు, జిల్లా భజరంగ్ దళ్ ప్రముఖ్ శ్రీ సందీప్ లు పాల్గొన్నారు.

విభాగ్ ధర్మ జాగరణ ప్రముఖ్ శ్రీరామ్ ప్రసాద్ మాట్లాడుతూ నంద్యాల నగరంలో మూడు సేవా బస్తీలను గుర్తించి ఆర్థికంగా వెనుకబడిన నిరుపేదలకు ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని చెప్పారు.
ఆ కార్యక్రమానికి సహకరిస్తున్నశ్రీ వెంకటరామిరెడ్డి, శ్రీ కేతపల్లి మోహన్ లకు కృతజ్ఞతలు తెలియ జేశారు. వీరు గతంలో కూడా ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణి చేసిన విషయం మిత్రులకు గుర్తుండే ఉంటుంది. యానాది సంఘం కుల పెద్దలు శ్రీ కొండయ్య తదితరులు కూడా పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.