Newsvideos

అంధత్వంతో బాధపడే వారి జీవితాలలో వెలుగులు నింపండి : సినీనటులు డాక్టర్ బ్రహ్మానందం

145views

తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖ హాస్య నటులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత, హాస్య బ్రహ్మ, డాక్టర్ బ్రహ్మానందం గారు నేత్ర దాన ప్రతిజ్ఞ చేసి సక్షమ్ చేస్తున్న సేవా కార్యక్రమాలను మనస్ఫూర్తిగా అభినందించి, ఆశీర్వదిస్తూ తన పూర్తి మద్దతు తెలియజేశారు. మరియు ప్రజలందరూ కూడా ఈ మహోద్యమంలో పాల్గొని నేత్రదాన ప్రతిజ్ఞ చేయాలని, తమ కళ్ళకు పునర్జన్మనిచ్చి అంధత్వంతో బాధపడే వారి జీవితాలలో వెలుగులు నింపాలని పిలుపునిచ్చారు.

అలాగే నేత్రదాన ఆవశ్యకతపై సాక్షి టీవీ ఛానల్ కొంతమంది ప్రముఖులతో చర్చా కార్యక్రమం నిర్వహించింది. ఈ చర్చా కార్యక్రమంలో ప్రముఖ సినీ నటులు డాక్టర్ బ్రహ్మానందం, సక్షమ్ అఖిల భారతీయ సంఘటనా కార్యదర్శి డాక్టర్ సుకుమార్, అఖిల భారతీయ సహ కార్యదర్శి డాక్టర్ సంతోష్, సరోజినీ దేవి ఐ హాస్పిటల్ కార్నియా విభాగాధిపతి డాక్టర్ శ్రీనివాస ప్రసాద్, LV ప్రసాద్ ఐ హాస్పిటల్ కార్నియా విభాగాధిపతి డాక్టర్ ప్రశాంత్ గార్గ్ లు పాల్గొన్నారు.

https://m.facebook.com/story.php?story_fbid=702859236972349&id=492197074287442?sfnsn=wiwspmo&extid=a&d=n&vh=e

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.