
467views
సరిహద్దు ప్రాంతంలో నెలకొన్ని ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. దీనిలో భాగంగా చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ వేగంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే అత్యాధునికి రఫేల్ యుద్ధవిమానాలను భారత వాయుసేనలో చేర్చిన విషయం తెలిసిందే. తాజాగా జపాన్‌తో రక్షణ సేవలకు సంబంధించిన కీలక ఒప్పందం చేసుకుంది. ముఖ్యంగా ఇరుదేశాల సైనిక సహకారాన్ని పెంచుకోవడంతో పాటు రక్షణ దళాల పరస్పర సేవల వినియోగానికి దోహదం చేసే ఒప్పందం(ACSA)పై సంతకం చేశాయి. భారత్ రక్షణశాఖ కార్యదర్శి అజయ్‌కుమార్, జపాన్ రాయబారి సుజుకీ సతోషి ఈ ఒప్పందంపై సంతకాలు చేసినట్లు భారత రక్షణమంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ ఒప్పందం ద్వారా ఇరుదేశాల రక్షణ సామర్థ్యాలు పెరగడంతోపాటు ద్వైపాక్షిక శిక్షణ కార్యక్రమాలలో దోహదం చేస్తాయని ఇరుదేశాలు అభిప్రాయపడ్డాయి.





