News

నేత్రదాన మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి – ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

28views

నేత్రదాన మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. దివ్యాంగుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ‘సక్షమ్’‌ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన నేత్రదాన పక్షోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించారు. నేత్రదానాన్ని శ్రేష్ఠమైన దానంగా అభివర్ణించిన ఆయన.. సమాజానికి మనమిచ్చే అత్యున్నత కానుకల్లో నేత్రదానం ఒకటన్నారు. నేత్రదానం చేసేవారి సంఖ్య దేశంలో తక్కువగా ఉందని గుర్తు చేశారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడం, జిల్లాస్థాయి వైద్య వ్యవస్థలో మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా అవయవ దానం, మార్పిడిని ప్రోత్సహించాలని ఆయన సూచించారు. దేశంలో 46లక్షల మంది అంధత్వంతో బాధ పడుతున్నారని వెంకయ్యనాయుడు తెలిపారు. అందులో ఎక్కువగా 50ఏళ్లకు పైబడిన వారున్నారని చెప్పారు. ఏటా 20వేల మంది కొత్తగా నేత్ర సమస్యలకు గురవుతున్నారని, వీరిలో యువత, చిన్నారులు ఉండటం బాధాకరమని ఆయన వివరించారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.