NewsProgrammsSeva

కరోనా జాగ్రత్తలు, లాక్ డౌన్ సమయంలో SSF సేవలు తెలుపుతూ SSF  ఇంటింటి ప్రచారం

170views

రోనా మహమ్మారి వ్యాధి ప్రబలకుండా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ గ్రామాలలో, మండల కేంద్రాలలో ఎవరి ఊరిలో వారు, ఎవరి వీధిలో వారితో SSF జట్లు ఏర్పాటు చేసి ప్రచారం నిర్వహించారు.

జులై మాసంలో 20వ తేది నుంచి 30వ తేది వరకు విడతల వారిగా “లాక్ డౌన్” నిబంధనలు సడలింపు కారణంగా గ్రామాలలో కరోనా వ్యాపించకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి సమగ్ర సమాచారాన్ని పొందుపరిచిన కరపత్రం, మూతికి గుడ్డ, మనిషికి, మనిషికి భౌతిక దూరం, పరిశుభ్రత గురించి తెలియచేసే స్టిక్కర్ తో ఇంటింటికి వెళ్లి తగు నియమాలు పాటిస్తూ వివరించారు. దీని కారణంగా ప్రజలలో చైతన్యం కలిగి వ్యాధి విస్తరించకుండా ఉపయోగపడింది.

313 మండలాలలో,3521 పంచాయతీలలో,5751 జట్లతో,15958 కార్యకర్తలు, 4,32,449 గృహాలకు వెళ్ళారు. మండల కేంద్రాలలో 48,323ఇండ్లకు, హరిజన, గిరిజన పల్లెల్లో 24,152 ఇండ్లకు వివరించారు. దీని కారణంగా పల్లెల్లో కరోనా వ్యాప్తి నిధానించడమే కాకుండా,వ్యాధి నిరోధక శక్తి పెరిగింది.

కరోనా తీవ్రత  ఉన్నా ,బయటకు రావడానికి ప్రజలు భయపడుతున్న స్థితిలో SSF ఇలా ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయడాన్ని ప్రజలందరూ స్వాగతించారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.