News

ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాది హతం

132views

మ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ జవాను కూడా అమరుడయ్యారు. పుల్వామా జిల్లా కమ్రాజ్‌పురా గ్రామంలో భద్రతా బలగాలు సోదాలు నిర్వహిస్తుండగా.. ఉగ్రవాదులు తారసపడ్డారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఘటనలో మరో భారత జవాను గాయపడ్డారు. ఘటనాస్థలం నుంచి ఏకే-47 తుపాకీ, గ్రనేడ్లు స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.