News

లెబనాన్‌ రాజధానిలో భారీ పేలుళ్లు

606views

లెబనాన్‌ రాజధాని బీరట్‌లో భారీ పేలుళ్లు సంభవించాయి. పేలుళ్ల ధాటికి సమీపంలోని పలు భవనాలు కుప్పకూలాయి. ఆ ప్రాంతంలో భారీగా మందుగుండు సామగ్రిని నిల్వ ఉంచడంతో ఒక్కసారిగా పేలిపోయినట్లు ప్రజారక్షణ శాఖ డైరెక్టర్‌ జనరల్‌ వెల్లడించారు. సహాయక సిబ్బంది సంఘటన స్థలికి చేరుకొని క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రులకు తరలిస్తున్నారు. మరోవైపు బీరట్‌లో రెండు పేలుళ్లు జరిగినట్లు అక్కడి భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. బీరట్‌లో ఉన్న భారతీయుల కోసం హెల్ప్‌లైన్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపింది. సాయం కోరేవారు 01741270,01735922,01738418 నెంబర్లను సంప్రదించవచ్చని చెప్పింది. అత్యవసర సేవలకు 96176860128కు ఫోన్‌ చేయాల్సిందిగా కోరింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.