News

హ్యూస్టన్ కాన్సులేట్ ను 72 గంటల్లో ఖాళీ చెయ్యండి : చైనాకు గడువు విధించిన యుఎస్

922views

చైనా మౌత్‌పీస్ ‘గ్లోబల్ టైమ్స్’ పత్రిక ఎడిటర్ హు జిజిన్ బుధవారం హ్యూస్టన్‌లోని చైనా కాన్సులేట్ ను 72 గంటల్లో మూసివేయాలని అమెరికా చైనాను కోరినట్లు పేర్కొన్నారు. అమెరికా చర్యను “వెర్రి చర్య” అని ఆయన అభివర్ణించారు. యుఎస్ స్థానిక మీడియా కథనాల ప్రకారం మంగళవారం రాత్రి చైనా కాన్సులేట్ జనరల్ కార్యాలయం ప్రాంగణంలో చైనా కాన్సులేట్ అధికారులు కొన్ని పత్రాలను తగలబెట్టినట్లు తెలిసింది. నిజానికి హ్యూస్టన్లోని అమెరికన్ అధికారులు దానిని తొలుత అగ్నిప్రమాదంగా భావించారు. దాంతో ఘటనా స్థలానికి డజన్ల కొద్దీ ఫైర్ ఇంజన్లు వచ్చాయి.

రాత్రి 8 గంటల తరువాత కాన్సులేట్లో పత్రాలు కాలిపోతున్నాయని తమకు ఫిర్యాదులు రావడం మొదలైందని హ్యూస్టన్ పోలీసు విభాగం తెలిపింది. కాన్సులేట్ ఉన్న 3417 మాంట్రోస్ బౌలేవార్డ్ వద్ద డజన్ల కొద్దీ హ్యూస్టన్ ప్రమాద నివారణా బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. కానీ వారు ఆ ప్రాంగణంలోకి వెళ్ళలేదని క్లిక్ 2 హౌస్టన్.కామ్ వెల్లడించింది.

కాన్సులేట్‌లోని చాలా మంది ఉద్యోగులు నివసించే అల్మెడ రోడ్‌లోని కాన్సులేట్ సముదాయాలు శుక్రవారం సాయంత్రం 4 గంటలకల్లా ఖాళీ అవుతాయని హ్యూస్టన్ పోలీసు వర్గాలు కెపిఆర్‌సి 2 కి తెలిపాయి. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణిస్తున్న ప్రస్తుత నేపథ్యంలో ఈ సంఘటన జరిగడంతో పరిణామాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

SOURCE : REPUBLICWORLD.COM

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.