
నాగరాజు అనే వ్యక్తి రెవెన్యూ భూమిలో నిర్మించిన చర్చిని గ్రామస్తుల అభ్యంతరంతో తానే స్వయంగా కూల్పించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని కడపజిల్లా, వీరపుణ్య మండలం, సర్వరాజపేట గ్రామంలో చోటు చేసుకుంది. కడప జిల్లాలోని కుప్పరాజుపల్లె పాఠశాలలో ఉపాధ్యాయునిగా పని చేస్తున్న నాగరాజు సర్వరాజపేట గ్రామంలోని రెవెన్యూ భూమిలో నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి అనుమతులు లేకుండా ఓ చర్చిని నిర్మించాడు. దీనిపై ఆగ్రహం చెందిన గ్రామస్తులు ఆ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. అక్రమ చర్చి నిర్మాణంపై కలెక్టరు స్పందనతో విధిలేక నాగరాజు తానే దగ్గరుండి అక్రమ చర్చిని కూల్చివేయడమే కాకుండా, గ్రామస్తులకు క్షమాపణ కూడా చెప్పాడు. సకాలంలో స్పందించి అక్రమ చర్చిని తొలగింపజేసిన జిల్లా కలెక్టరుకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.
After formal complaints from villagers with District collector against unauthorized church at Sarvarajupet, Veerapunya (M), Kadapa, AP, Christian Pastor Mr. K Nagaraju himself demolished his own Church using JCB and apologized to villagers. https://t.co/UIKcq0rJHx pic.twitter.com/LenTdb63qR
— Legal Rights Protection Forum (@lawinforce) July 17, 2020





