News

జమ్మూకశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

412views

మ్మూకశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతాదళాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. కుల్గాం జిల్లా నాగ్‌నాద్‌ – చిమ్మెర ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో భద్రతాదళాలు సోదాలు నిర్వహించాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. ఘటనాస్థలి నుంచి పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు కూడా గాయపడినట్లు సమాచారం. ఉగ్రవాదుల కోసం ఆపరేషన్‌ కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.