News

తిరుమలలో వైభవంగా ఆణివార ఆస్థానం

483views

శ్రీవారి ఆలయంలో సాలకట్ల ఆణివార ఆస్థానంను తితిదే వైభవంగా నిర్వహించింది. తమిళనాడులోని శ్రీరంగం ఆలయం నుంచి తీసుకువచ్చిన పట్టు వస్త్రాలను ఊరేగింపుగా స్వామివారి సన్నిధికి తీసుకొచ్చారు. మందిరంలోని బంగారు వాకిలి వద్ద ఘంటా మండపంలో ఉభయ నాంచారులతో కూడిన మలయప్పస్వామివారిని గరుత్మంతునికి అభిముఖంగా ఆశీనులు చేసి పాలు, తేనె, పచ్చ కర్పూరం, సుగంధమైన పరిమళాలతో అభిషేకాలు నిర్వహించారు.

ఇదే సమయంలో గర్భాలయంలోని శ్రీవారి మూలమూర్తి ఎదుట.. గత ఏడాది పొడవునా ఎంత ఆదాయం వచ్చింది, అందులో భక్తుల అవసరాలు, దేవస్థానం అభివృద్ధి కోసం ఎంత ఖర్చు చేసింది తితిదే అధికారులు, అర్చకులు లెక్కలు చెప్పారు. ఆదాయ వ్యయాల నివేదన పూర్తయిన తర్వాత అర్చకులు పెద్దజీయర్‌, చిన్న జీయర్‌, ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ ‘లచ్చన’ అనే తాళపు చెవిని మూలవిరాట్టు పాదాల చెంత ఉంచారు. ఈవో సమక్షంలో తితిదే ఖజానాకు జమచేయడంతో నూతన లెక్కలు ప్రారంభమయ్యాయి. ఆణివార ఆస్థానంను పురస్కరించుకుని ఆలయాన్ని సుందరంగా అలంకరించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.