తూర్పు లడఖ్‌లోని ఎల్ఐసిలో నెలకొన్న ఉద్రిక్తతల నడుమ ఒక పెద్ద ముందడుగు పడింది. కార్ప్స్ కమాండర్ సమావేశంలో అంగీకరించిన నిబంధనల ప్రకారం చైనా పిఎల్ఎ శ్రేణులు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళడం ప్రారంభమైంది.
గాల్వన్ వ్యాలీ ఫేస్ఆఫ్ జరిగిన ప్రదేశం – పెట్రోల్ పాయింట్ 14 వద్ద చైనీయులు గుడారాలు మరియు ఇతర నిర్మాణాలను కూడా తొలగిస్తున్నారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ యొక్క వాహనాలు వెనుకకు మరలుతున్న దృశ్యాలు గాల్వన్, హాట్స్ స్ప్రింగ్స్ & గోగ్రా ప్రాంతాల వద్ద కనిపిస్తోంది.
1-2 కి.మీ. వెనక్కు వెళ్ళిన చైనీయులు :
అంతకుముందు, చైనీయులు వెనుదిరగడానికి అంగీకరించిన ప్రదేశాల నుండి 1-2 కిలోమీటర్ల వెనక్కి వెళ్ళారని సంబంధిత వర్గాలు తెలిపాయి. కానీ గల్వాన్ వద్ద ఫార్వర్డ్ ఏరియాల్లో చైనా భారీ సాయుధ వాహనాలు ఇప్పటికీ ఉన్నాయని, భారత సైన్యం పరిస్థితిని జాగ్రత్తగా పర్యవేక్షిస్తోందని వారు తెలిపారు.
Source : Republic TV
https://www.republicworld.com/world-news/china/vdisengagement-of-indian-and-chinese-troops-begin-in-galwan-as-per-terms.html?utm_source=izooto&utm_medium=push_notifications&utm_campaign=Disengagement&utm_content=&utm_term=