News

ఒడిశాలో నలుగురు మావోలు హతం

877views

డిశాలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. కందమాల్‌ జిల్లాలోని సిర్ల అటవీ ప్రాంతంలో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పుల అనంతరం కొందరు మావోయిస్టులు అడవుల్లోకి పరారయ్యారు. అనంతరం భద్రతా బలగాలు చేపట్టిన గాలింపులో నలుగురు మావోయిస్టుల మృతదేహాలను గుర్తించారు. భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన వారి కోసం గాలింపు ఉద్ధృతం చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.