News

జూలై 21 నుంచి అమరనాథ్ యాత్ర

554views

మ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్‌ జిల్లాలో ఉన్న పవిత్ర అమర్‌నాథ్‌ గుహలో ఏర్పడే మంచు లింగాన్ని దర్శించుకునేందుకు ఉద్దేశించిన అమర్‌నాథ్‌ యాత్ర జులై 21న ప్రారంభం కానుంది. ఈ సారి కేవలం 14 రోజుల పాటు మాత్రమే ఈ యాత్ర కొనసాగనుంది. ఆగస్టు 3తో ముగియనుంది. ఇప్పటికే ఈ యాత్రకు సంబంధించి శుక్రవారం ప్రథమ పూజ నిర్వహించారు.

అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లదలిచిన వారు ఈ సారి కేవలం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. లాటరీ విధానంలో టికెట్లను ఎంపిక చేస్తారు. కేవలం 4 నుంచి 5 వేల మంది యాత్రికులను మాత్రమే ఎంపిక చేయనున్నారు. 55 ఏళ్లు పైబడిన వారికి యాత్రకు అనుమతించరు. సాధువులకు మాత్రం ఈ విషయంలో మినహాయింపు ఉంటుంది. అలాగే యాత్రికులకు కొవిడ్‌-19 పరీక్షలు చేస్తారు. లక్షణాలు లేనివారికి మాత్రమే యాత్రకు అనుమతిస్తారు. తొలిసారిగా ఉదయం, సాయంత్రం లైవ్‌ హారతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు అమర్‌నాథ్‌ దేవస్థానం బోర్డు తెలిపింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.