
ఇటీవల మహీంద్రాలో తయారైన తేలికపాటి సాయుధ వాహనం (ఏఎల్‌ఎస్‌వీ) పనితీరును సైన్యం పరీక్షిస్తోంది. ఈ వాహనాన్ని మహీంద్రా ఎమిరేట్స్ వెహికల్ ఆర్మురింగ్ సంస్థ తయారు చేస్తోంది. మహీంద్రా ఆర్మర్డ్ లైట్ స్పెషలిస్ట్ వెహికల్ (ఎంఈవీఈ) పై వచ్చిన ఒక ఆర్టికల్‌ను ఆయన పోస్టు చేశారు. మా రక్షణ విభాగం బృందం ఎంఅండ్‌ఎం అర్థాన్ని ‘మీన్ మీషిన్’ (ప్రామాణిక యంత్రం)గా మార్చేశారు. వారి అత్యుత్తమ ప్రమాణాలకు ఇదొక చిహ్నం’ అని ట్వీట్ చేశారు.
ఎటువంటి భూభాగాలపైన అయినా ప్రయాణించే విధంగా దీనిని తీర్చి దిద్దారు. అత్యంత కఠిన పరిస్థితుల్లో కూడా నిరంతరాయంగా పెట్రోలింగ్ నిర్వహించవచ్చు. సాధారణంగా ఇటువంటి వాహనాలను ప్రత్యేక దళాలు కీలకమైన ఆపరేషన్లలో త్వరితగతిన స్పందించడానికి వినియోగిస్తాయి. ఈ వాహనం స్టాంగ్ లెవల్-1 పేలుళ్లను తట్టుకొనే విధంగా దీనిని తయారు చేశారు. ఇది 51ఎంఎం తూటాల దాడిని కూడా తట్టుకొంటుంది. అవసరమైన ఆయుధాలను భద్రపర్చుకోవడానికి తగినంత స్థలం ఇచ్చారు. దాదాపు 400 కేజీల సరుకులను దీనిపై తరలించవచ్చు. స్టాంగ్ స్థాయి పేలుళ్లను తట్టుకొనేలా దీనిని అప్‌గ్రేడ్ చేయవచ్చు.





