News

వెంకన్న భూములు వేలానికి

253views

మిళనాడులోని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పరిధిలోని స్థిరాస్తులను విక్రయించేందుకు తితిదే నిర్ణయం తీసుకుంది. మొత్తంగా 23 ఆస్తులను బహిరంగ వేలం ద్వారా విక్రయించడానికి తితిదే ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 29న జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో ఆస్తుల విక్రయానికి సంబంధించి తీర్మానం చేశారు. ఏప్రిల్‌ 30న బోర్డు ఉత్తర్వులు జారీ చేయగా.. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమిళనాడులోని 23 ప్రాంతాల్లో ఆస్తుల విక్రయానికి రెండు బృందాలను తితిదే ఏర్పాటు చేసింది. ఈ రెండు బృందాల్లో 8 మంది అధికారులను నియమిస్తూ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఆస్తుల బహిరంగ వేలానికి సంబంధించి విధివిధానాలు ఖరారు చేయాలని అధికారులకు బోర్డు సూచించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.