ఇల వైకుంఠపురంలో… వ్యాస ధర్మ క్షేత్రం
అనంతమైన వేదరాశిని నాలుగు వేదాలుగా విభజించి, పంచమ వేదమైన మహాభారతాన్నీ, శ్రీమద్భాగవతాన్నీ, అష్టాదశ పురాణాలనూ లోకానికి అందించిన మహనీయుడు, ప్రాతఃస్మరణీయుడు వ్యాస భగవానుడు. సాక్షాత్తూ శ్రీమన్నారాయణ స్వరూపుడైన ఆ మహా గురువు కృష్ణానదీ తీరంలోని వైకుంఠపురంలో పూజలందుకుంటున్నాడు. ధర్మ మార్గాన్ని ప్రబోధించి,...








