ఆధునిక కాలపు అత్యవసరం – పంచ పరివర్తన జీవన సూత్రాలు
శాస్త్ర సాంకేతిక రంగాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. నిన్నటి ఆవిష్కరణ నేడు పాతబడి పోతున్నది. నేటి సాంకేతికత రేపటి మార్పునకు పునాది అవుతున్నది. నిత్య మార్పులను ఆకళింపు చేసుకుంటూ ప్రయాణం చేయవలసిన అగత్యం ఏర్పడింది. నిత్యం అప్‌డేట్ కాకపోతే అవుట్‌డేట్ కావలసి...













