News

ముంబై లో యువ జంటపై ముస్లిం మైనర్ల దాడి.. వైరల్ వీడియోతో స్పందించిన పోలీసులు

0views

ముంబైలోని కుర్లా వెస్ట్‌లో ఉన్న ప్రమోద్ మహాజన్ గార్డెన్‌లో ఓ యువ జంటపై ముస్లిం మైనర్ల గుంపు దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఫీనిక్స్ మార్కెట్‌సిటీ మాల్ వెనుక ఉన్న ఈ పబ్లిక్ గార్డెన్‌లో జరిగిన దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు చర్యలు చేపట్టారు.

వివరాల ప్రకారం, గార్డెన్‌లో ఉన్న యువ జంటను కొందరు ముస్లిం బాలురు అసభ్యకర వ్యాఖ్యలతో వేధించినట్లు సమాచారం. దీనిపై యువ జంట ప్రశ్నించడంతో వారిని చుట్టుముట్టిన బాలురు కర్రలతో దాడి చేయడంతో పాటు పిడిగుద్దులు, తన్నులతో తీవ్రంగా కొట్టారు. బాధితులు అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ వారిని వెంబడించినట్లు వైరల్ వీడియోలో కనిపిస్తోంది.

ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాడిలో పాల్గొన్న ఎనిమిది మంది ముస్లిం మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. వారిని జువెనైల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. ఘటనలో పాల్గొన్న ఐదుగురు బాలుర తల్లిదండ్రులకు కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు.

అక్రమంగా గుమిగూడటం, గాయపరచడం, ఉద్దేశపూర్వకంగా అవమానించడం, నేరపూరిత బెదిరింపులకు సంబంధించిన BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

బహిరంగ ప్రదేశాల్లో మహిళలు, యువతుల భద్రతపై ఈ ఘటన మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.