News

బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో లోకమాన్య శ్రీ బాలగంగాధర్ జి తిలక్ 170వ జయంతి కార్యక్రమం

26views

లోకమాన్య శ్రీ బాలగంగాధర్ జి తిలక్ 170 జయంతి కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకి హైదరాబాద్  కోటిలోని తిలక్ పార్క వద్ద ఉన్న బాలగంగాధర్ జీ తిలక్ గారి విగ్రహానికి బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ సహకార దర్శి జి రమేష్ జి మరియు జగదీశ్వర్ జి వెంకన్న బి బజరంగ్ దళ్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ కొండా శ్రీకాంత్ తదితరులు పాల్గొని మాట్లాడారు.

శ్రీ లోకమాన్య బాలగంగాధర్ జి తిలక్ గారి జయంతి పురస్కరించుకొని ఈరోజు మనమంతా భక్తి భావన తో జరుపుకుంటున్న గణేష్ ఉత్సవాలని శ్రీబాలగంగాధర్ జి తిలక్ గారు స్వాతంత్ర్యం నా జన్మ హక్కని హిందువులలో ఐక్యతను పెంపొందించేందుకు ప్రారంభిచిన గణేష్ నవరాత్రి ఉత్సవాలు, ఈరోజు యువత వారి యొక్క త్యాగాన్ని గుర్తించకుండా ఎవరికి వచ్చిన తరహాలో వాళ్ళు నిర్వహించడం చాలా భాదాకరమైన విషయమని ఆవేధన వ్యక్తపరిచారు. ఇకనైనా యువత మేల్కొని లోకమాన్య శ్రీ బాలగంగాధర్ జి తిలక్ గారి ఆశయ సాధన కోసం యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు గణేష్ మండపాల దగ్గర భక్తి పాటలను మాత్రమే అలాగే వినాయక నిమజ్జనం రోజున కూడా భజన కార్యక్రమాలతో వినాయక సాగర్ వైపు సాగాలని పిలుపునిచ్చారు. యువత ఇప్పటికైనా మేలుకొని హిందూ ధర్మ పరిరక్షణ కోసం మన పెద్దలు చూపిన మార్గంలో నడవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ రాష్ట్ర సహ కన్వీనర్ ముకేష్ యాదవ్, నగర కన్వీనర్ అఖిల్, సహ కన్వీనర్ రాహుల్, భరత్వంశీ, విధ్యానగర్ జిల్లా విశ్వహిందూ పరిషత్ అధ్యక్షులు జస్వంత్ జి మరియు అభిలాష్, అభిషేక్, అంకిత్ తదితరులు పాల్గొన్నారు.