News

ఆర్‌ఎస్‌ఎస్‌పై మరోసారి ప్రియాంక్ ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు.. “అనుమతి లేకుండా పథ సంచలన్ జరగవు”

8views

కలబురిగి: కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే మరోసారి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)పై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. తాను మంత్రిగా ఉన్నంత కాలం రాష్ట్రంలో ఆర్‌ఎస్‌ఎస్ నిర్వహించే ప్రతి పథ సంచలన్ కు తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందేనని ఆయన ప్రకటించారు.

కలబురిగిలో మీడియాతో మాట్లాడిన ఖర్గే, “నేను మంత్రిగా ఉన్నంత కాలం ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు అనుమతి తీసుకున్న తర్వాతే జరుగుతాయి” అని వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా, ఆర్‌ఎస్‌ఎస్ సర్సంఘచాలక్ మోహన్ భగవత్‌కు లేఖ రాశానని వెల్లడించిన ఖర్గే, “మీరు 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన సంస్థ అని చెబుతున్నారు. మరి ఆ సంస్థకు సంబంధించిన రికార్డులు ఎక్కడ ఉన్నాయి? వాటిని వెతికి చూపించండి. అప్పటి వరకు నేను ఈ అంశాన్ని వదిలిపెట్టను” అని అన్నారు.

ఖర్గే చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ను లక్ష్యంగా చేసుకుని మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

. ఈ అంశం కర్ణాటక రాజకీయాల్లో మరోసారి వాగ్వాదానికి దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.