News

సంప్రదాయ గిరిజన విజ్ఞానాన్ని ఆధునిక సాంకేతికతతో అనుసంధానించాలి

33views

గిరిజన వారసత్వాన్ని పరిరక్షించడంతో పాటు.. సమ్మిళిత అభివృద్ధిని సాధించాలంటే సంప్రదాయ గిరిజన విజ్ఞానాన్ని ఆధునిక సాంకేతికతతో అనుసంధానించాల్సిన అవసరం ఉందని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖా మంత్రి జువాల్ ఓరం అన్నారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో రెండు రోజుల గిరిజన జాతీయ సదస్సును కేంద్ర గిరిజన   మంత్రి   మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గిరిజన పరిశోధనా సంస్థలు సంప్రదాయ విజ్ఞానాన్ని ఆధునిక పరిశోధన, సాంకేతిక ఆవిష్కరణలతో సమన్వయం చేస్తూ అత్యుత్తమ పరిశోధనా కేంద్రాలుగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. గిరిజన భాషలు, సంస్కృతీ, సాంప్రదాయ జ్ఞానాన్ని పరిరక్షిస్తూనే.. డిజిటల్ సాంకేతికత, కృత్రిమ మేధ (ఏఐ)ను ఉపయోగించి పరిశోధన, డాక్యుమెంటేషన్, విధాన రూపకల్పనను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ జాతీయ సదస్సులో దేశ వ్యాప్తంగా విధాన నిర్ణేతలు, పరిశోధకులు, విద్యా వేత్తలు, సాంకేతిక నిపుణులు పాల్గొంటున్నారు. గిరిజన పరిశోధనా సంస్థలను జ్ఞాన కేంద్రాలుగా తీర్చిదిద్ధే లక్ష్యంతో మంత్రిత్వ శాఖ ఒక నూతన కార్యాచరణను కూడా ఈ సందర్భంగా ప్రకటించింది.