News

మైనర్ బాలికను మత మార్పిడికి ప్రేరేపించారన్న ఆరోపణలు.. ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

43views

 

ఎటావా (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్‌లోని ఎటావా జిల్లాలో 13 ఏళ్ల హిందూ మైనర్ బాలికను మత మార్పిడికి ప్రేరేపించి, విదేశానికి తీసుకెళ్లేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

బాధిత బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు, తన కుమార్తె స్థానికంగా నిర్వహిస్తున్న డ్యాన్స్ ఇన్‌స్టిట్యూట్‌కు వెళ్లేదని, అక్కడ ఒక మహిళతో ఆమెకు పరిచయం ఏర్పడిందని పేర్కొన్నారు. ఆ పరిచయం ద్వారా కొందరు వ్యక్తులు బాలికతో సన్నిహితంగా మెలిగి, మత మార్పిడికి ఒత్తిడి తెచ్చినట్లు ఆయన ఆరోపించారు.

ఫిర్యాదు ప్రకారం, మత మార్పిడి అనంతరం బాలికను దోహా (ఖతార్)కు తీసుకెళ్లే ఉద్దేశంతో ఆమె మొబైల్ ఫోన్‌కు సందేశాలు పంపినట్లు కూడా పేర్కొన్నారు.

ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, ఆరోపణల నిజానిజాలపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.