News

నలంద విశ్వవిద్యాలయం సమీపంలో గుప్తుల కాలం నాటి స్నానఘట్టం

31views

 

నలంద విశ్వవిద్యాలయం సమీపంలో గుప్తుల కాలం నాటి స్నానఘట్టంబిహార్ లోని నలంద విశ్వవిద్యాలయం సమీపంలోని ఒక జలాశయం వద్ద కాల్చిన ఇటుకలు, సున్నపు పూతతో నిర్మించిన 1,600 ఏళ్ల నాటి స్నానఘట్టం బయటపడింది. నలంద విశ్వవిద్యా లయం శిథిలాలకు వాయవ్యంగా ఉన్న హ్యూన్ త్సాంగ్ స్మారక చిహ్నం సమీపంలోని సూరజ్పుర్ గ్రామంలో గల పన్సోఖర్ పోఖర్ (జలాశయం)లో నలంద జిల్లా యంత్రాంగం ఎర్త్ మూవర్లు, పొక్లెయిన్ల సహాయంతో పూడికతీత పనులు చేపడుతున్నప్పుడు ఈ స్నానఘట్టం బయటపడింది. పన్సోఖర్ పోఖర్ జలాశయం సుమారు 850 మీటర్ల పొడవు, 175 మీటర్ల వెడల్పుతో ఉంది. ఈ జలాశయంలో అనేక మట్టిపాత్రల శకలాలు, గుప్తుల కాలానికి చెందినదిగా భావిస్తున్న ఒక రాగి నాణెం, సుమారు 25 మిల్లీమీటర్ల వ్యాసం గల ఒక లోహ మిశ్రమ కాయిల్ లభించాయి.