
హిందూ యువకుడు ఆయుష్ మాలిక్ మత మార్పిడి కేసులో పరారీలో ఉన్న తౌఫీక్ అలియాస్ భోలా అనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయుష్ మాలిక్‌ను ఇస్లాంలోకి మార్చడం, అనంతరం అతని ‘నికాహ్’ నిర్వహించేందుకు కుట్ర పన్నినట్లు తౌఫీక్‌పై ఆరోపణలు ఉన్నాయి. నిందితుడి వద్ద నుంచి ఒక ‘నికాహ్‌నామా’ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల సమాచారం ప్రకారం,ఉత్తరప్రదేశ్ తౌఫీక్ షమ్లీ ప్రాంతానికి చెందినవాడు. అతనిపై ఇప్పటికే పలు క్రిమినల్ కేసులు నమోదై ఉండగా, ఆయా కేసులకు సంబంధించి కూడా పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.
ఇదివరకు ఈ కేసులో ప్రధాన నిందితులుగా పేర్కొంటున్న జిమ్ ట్రైనర్ చాందిని ఖురేషీ, ఆమె తండ్రి ఇస్లాం ఖురేషీలను జూన్ 7న పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు.
దర్యాప్తులో భాగంగా, షమ్లీకి చెందిన ఒక ప్రముఖ ముస్లిం వైద్యుడితో కలిసి ఆయుష్ మాలిక్ నమాజ్ చేస్తున్న ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. ఈ అంశంపై కూడా పోలీసులు విచారణ చేపట్టారు.
అదేవిధంగా, ఢిల్లీ మరియు ముంబైకి చెందిన కొంతమంది మౌల్వీల పాత్రలపై కూడా అధికారులు క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఆయుష్ మాలిక్ తండ్రి దేవరాజ్ మాలిక్ మాట్లాడుతూ, తన కుమారుడు 2018లో ‘ఖురేషీ ప్లస్’ జిమ్‌కు వెళ్లడం ప్రారంభించాడని తెలిపారు. అక్కడి జిమ్ ట్రైనర్ చాందిని ఖురేషీ, ఆమె కుటుంబ సభ్యులు మరియు కొంతమంది మౌల్వీలు కలిసి తన కుమారుడిపై మతపరమైన ప్రభావం చూపారని ఆయన ఆరోపించారు.
అయతే, తన తండ్రి చేసిన ‘మానసిక అస్థిరత’ మరియు ‘భయపెట్టడం’ వంటి ఆరోపణలను ఆయుష్ మాలిక్ ఖండించారు. ఇస్రార్ అహ్మద్‌కు సంబంధించిన వీడియోలు చూసిన తరువాత తనకు ఇస్లాం పట్ల ఆసక్తి కలిగిందని ఆయన పేర్కొన్నారు.
అన్ని కోణాల్లో దర్యాప్తు
ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగుతోందని షమ్లీ ఎస్పీ ఎన్.పి. సింగ్ తెలిపారు. ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న ఇతర వ్యక్తులను గుర్తించి అరెస్టు చేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.





