ArticlesNews

ద్విముఖ జిహాద్ : ఒకే లక్ష్యం.. రెండు భిన్న మార్గాలు…

33views

జిహాద్.. ఈ పదాన్ని మనం కేవలం ఉగ్రవాద కోణంలోనే చూస్తుంటాం. కానీ సమకాలీన ప్రపంచంలో, ఇది ఒక బహుముఖ వ్యూహంగా రూపాంతరం చెందింది. దేశ భౌతిక సరిహద్దుల కంటే, ఆ దేశపు సంస్కృతిని, ఆర్థిక వ్యవస్థను జనాభా స్వరూపాన్ని మార్చే ఈ యుద్ధ తంత్రాన్ని విశ్లేషకులు ‘సాఫ్ట్ జిహాద్’ , ‘హార్డ్ జిహాద్’ అని పిలుస్తున్నారు. ఈ రెండింటి మధ్య ఉన్న భయంకరమైన వ్యత్యాసాన్ని, అవి పనిచేసే తీరును ఇప్పుడు ఉదాహరణలతో సహా విశ్లేషిద్దాం.

ముందుగా సాఫ్ట్ జిహాద్. ఇది కంటికి కనిపించదు, రక్తం చిందించదు.. కానీ లోలోపల ఒక దేశపు పునాదులను తుప్పు పట్టిస్తుంది. దీనిని అర్థం చేసుకోవడానికి ‘హలాల్ ఎకానమీ’ ఒక స్పష్టమైన ఉదాహరణ. మొదట్లో మాంసానికి మాత్రమే పరిమితమైన ఈ సర్టిఫికేషన్, నేడు పప్పులు, నూనెలు, కాస్మెటిక్స్, చివరకు రియల్ ఎస్టేట్ వరకు విస్తరించింది. ఇది ఒక సమాంతర ఆర్థిక వ్యవస్థను సృష్టిస్తూ, మతపరమైన సంస్థల ఆదాయాన్ని పెంచుతోంది.

మరో ఉదాహరణ మన విద్యా వ్యవస్థ మరియు మీడియా. దశాబ్దాలుగా మన చరిత్ర పుస్తకాల్లో దండయాత్ర చేసిన మొఘల్ పాలకులను గొప్పగా కీర్తిస్తూ, స్థానిక వీరులైన శివాజీ లేదా రాణా ప్రతాప్ వంటి వారిని కేవలం ప్రాంతీయ నాయకులుగా పరిమితం చేయడం ‘హిస్టరీ జిహాద్’లో భాగం. అలాగే, ఆధునిక సినిమాల్లో లేదా వెబ్ సిరీస్‌లలో ఒక వర్గాన్ని ఎప్పుడూ అమాయకులుగా, బాధిత వర్గంగా చూపుతూ.. మెజారిటీ సమాజాన్ని విలన్లుగా చిత్రించడం ద్వారా యువత మనసుల్లో విషాన్ని నింపడం సాఫ్ట్ జిహాద్ వ్యూహం.

ఇక హార్డ్ జిహాద్ విషయానికి వస్తే.. ఇది ప్రత్యక్షంగా భౌగోళిక మార్పులను లక్ష్యంగా చేసుకుంటుంది. దీనికి అతిపెద్ద ఉదాహరణ ‘డెమోగ్రాఫిక్ జిహాద్’ లేదా జనాభా నిష్పత్తిని మార్చడం. అస్సాం మరియు పశ్చిమ బెంగాల్ వంటి సరిహద్దు రాష్ట్రాల్లో అక్రమ వలసల కారణంగా కేవలం కొన్ని దశాబ్దాల్లోనే స్థానిక జనాభా గణాంకాలు తలకిందులయ్యాయి. ఇది ఓటు బ్యాంకు రాజకీయాలను శాసిస్తూ, ఆ ప్రాంతపు నిర్ణయాధికారాన్ని మార్చేస్తోంది. అంతేకాదు పండగల సమయంలో మనల్ని లక్ష్యంగా చేసుకుని కావాలని మనవారిపై రాళ్లురువ్వడంలాంటి ఘటనలు ఎన్నోఉన్నాయి.తాజాగా హోళీ సమయంలో ఢిల్లీలో జరిగిన ఘటనే ఇందుకు సజీవ సాక్ష్యం.ఇలాంటి సంఘటలు కూడా ఈ మధ్యకాలంలోఎక్కువగా జరుగుతున్నాయి.

సామాజిక స్థాయిలో ‘లవ్ జిహాద్’ను మనం కేవలం ప్రేమ వ్యవహారంగా చూడలేం. ఇదొక వ్యూహాత్మక కుట్ర కేరళలో వెలుగులోకి వచ్చిన ఎన్నో సంఘటనలు, హిమాచల్ లేదా ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో జరుగుతున్న ఉదంతాలు ఒక వ్యవస్థాగత వ్యూహాన్ని సూచిస్తున్నాయి. అమ్మాయిలను మాయమాటలతో ట్రాప్ చేసి, మత మార్పిడికి ఒత్తిడి చేయడం ద్వారా సామాజిక సమతుల్యతను దెబ్బతీయడం దీని లక్ష్యం. తాజాగా భాగ్యనగరంలోని పంజాగుట్ట పరిధిలో హిందూ యువతులను లక్ష్యంగా చేసుకుని, ప్రేమ పేరుతో వారిని ట్రాప్ చేస్తున్న జమీర్, అతని తమ్ముడు మిరాజ్ వ్యవహారం బయటపడింది. వాళ్లని పోలీసులు అరెస్టు చేశారు. ఇలా కేవలం హిందూ యువతులను, మహిళలను లక్ష్యంగా చేసుకుని లవ్ జిహాద్ పేరుతో మోసం చేసే వ్యూహం దేశమంతటా తీవ్రంగా విస్తరించింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగినులు “లవ్ జిహాద్” బాధితులుగా మారిన కొన్ని సంఘటనలు కూడా హైదరాబాద్, నాసిక్ వంటి నగరాల్లో ఇటీవల వెలుగులోకి వచ్చాయి.నాసిక్ ఉదంతం దేశమంతటా ఎలాంటి సంచలనాన్ని సఈష్టించిందో మనందరికీ తెలిసిందే.

అలాగే, ‘లాండ్ జిహాద్’ను గమనిస్తే.. ఉత్తరాఖండ్ వంటి దేవభూమిలో లేదా హైదరాబాద్ వంటి నగరాల్లో రోడ్ల పక్కన, పార్కుల్లో రాత్రికి రాత్రే వెలిసే మతపరమైన కట్టడాలు ఆ భూభాగంపై పట్టు సాధించే ప్రయత్నాలే. ఏ చిన్న ఖాళీ స్థలాన్ని కూడా వారు వదలకుండా భూభాగాన్ని ఆక్రమించేస్తున్నారు. ఇక వారి జనాభా ఎక్కువగా ఉన్న చోట ఇక చివరిగా ‘డైరెక్ట్ జిహాద్’. ఇది ఉగ్రవాదం, సాయుధ పోరాట రూపంలో ఉంటుంది. కాశ్మీర్‌లో హిందూ పండిట్లపై జరిగిన దాడులు లేదా ఇటీవల మారుమూల గ్రామాల్లో జరుగుతున్న లక్షిత హత్యలు సమాజంలో భయాన్ని నింపడానికి చేసే ప్రత్యక్ష ప్రయత్నాలు.

మనం అర్థం చేసుకోవాల్సిన కీలక విషయం ఏమిటంటే.. హార్డ్ జిహాద్ అనేది ఒక ప్రాంతాన్ని భౌతికంగా ఆక్రమించడానికి ప్రయత్నిస్తే, సాఫ్ట్ జిహాద్ ఆ ఆక్రమణకు మేధోపరమైన రక్షణను, చట్టబద్ధతను కల్పిస్తుంది. ఈ రెండు రూపాల పట్ల అవగాహన లేకపోతే, మనం శత్రువు ఎవరో గుర్తించలేక, మన వ్యవస్థలనే మనకు వ్యతిరేకంగా వాడుకునేలా చేస్తాం. దేశ రక్షణ అంటే కేవలం సరిహద్దుల వద్ద కాపలా కాయడం మాత్రమే కాదు.. మన విద్యా సంస్థల్లో, మార్కెట్లలోను, సామాజిక సంబంధాల్లోను జరుగుతున్న మార్పులను గమనిస్తూ అప్రమత్తంగా ఉండటమే అసలైన దేశభక్తి.