
కొన్ని తీవ్రవాద శక్తుల నుంచి వ్యతిరేకత వ్యక్తంకావటంతో లాహోర్ లోని పలు రోడ్లు, వీధులు, గల్లీ లకు పాత పేర్లను పునరుద్ధరించే ప్రణాళికను పాకిస్థాన్ పంజాబ్ ప్రభుత్వం పక్కన పెట్టింది. దేశవిభజనకు ముందు ఉన్న హిందూ, సిక్కు పేర్లను పునరుద్ధరించాలని పాక్ నేతృత్వంలోని పంజాబ్ సీఎం మరియం నవాజ్ సర్కారు కొద్దిరోజుల కిందట నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయాన్ని పాక్ లోని కొన్ని తీవ్రవాద శక్తులు విమర్శిం చాయి. మరియం ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంజేశాయని సమాచారం. దీంతో మరియం ప్రభుత్వం వెనకంజవేసింది. తమ నగరంలోని రోడ్లకు, వీధులకు పేర్లు మార్చే విషయం ఇంకా చర్చల్లోనే ఉందని, అందుకే దీనిపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని లాహోర్ డిప్యూటీ కమిషనర్ కెప్టెన్ ఆర్ ముహమ్మద్ అలీ ఇజాజ్ వెల్లడించారు. ప్రభుత్వ నిర్ణయానికి కొందరు విమర్శకులు మతం రంగు పులమడంతో వ్యతిరేకతను నివారించేందుకు తన నిర్ణయంపై మరియం సర్కారు వెనుకడుగు వేసిందని ఆయన పేర్కొన్నారు.





